pawan kalyan, renu desai
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి మొదట `బద్రి` సినిమాలో నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతోనే సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్.
అయితే ఈ మూవీకి ముందు జరిగిన సంఘటన బయటపెట్టింది పవన్ మాజీ భార్య. అసలు తనకు సినిమాల్లోకి రావాలనే ఆలోచనే లేదట. అంతేకాదు మరికొన్ని ఆసక్తికర షాకింగ్ విషయాలను ఆమె బయటపెట్టింది.
renu desai (etv)
రేణు దేశాయ్.. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిందట. ముంబయిలో మోడలింగ్ చేస్తున్న క్రమంలో తన ఫోటోలు మేనేజర్ల ద్వారా సర్య్కూలేట్ అయ్యాయి. అలా పూరీ జగన్నాథ్ వద్దకు తన ఫోటో వెళ్లింది.
ఆయన తనని చూడగానే ఈమెని తన మొదటి సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకోవాలనుకున్నారట. ఆయన ఫస్ట్ సినిమా ఓకే అయ్యింది. పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు. దీంతో హీరోయిన్ సెలెక్షన్ కోసం తన ఫోటో పట్టుకుని పూరీ ముంబయి వచ్చాడు.
అప్పుడు తన కాంటాక్ట్ సంపాదించి ఫోన్ చేయగా, తాను మొదట నో చెప్పాను అని తెలిపింది రేణు దేశాయ్. తనకు సినిమాలు చేయడం ఇష్టం లేదని చెప్పినట్టు వెల్లడించింది.
renu desai (etv)
తాను నో చెప్పినా కూడా వదల్లేదని, చాలా మందితో చెప్పించారని, మంచి కథ, హీరో పెద్ద పాపులర్ అని చెప్పారట. అయితే పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదు, నేను ఒకసారి ఆయన్ని చూడాలని అన్నదట రేణు దేశాయ్.
తెలుగులో అప్పటి వరకు తనకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ పేర్లు తెలుసు కానీ, ఈ పవన్ ఎవరో అన్నదట. చిరంజీవి తమ్ముడు, `తొలిప్రేమ`తో అప్పుడే పెద్ద హిట్ కొట్టాడు అని చెబితే ఆయన్ని చూడాలని అన్నదట. అలా హైదరాబాద్‌కి తీసుకొచ్చారు, రామానాయుడు స్టూడియోలో కలిపించారట.
pawan, renu desai
చిరంజీవి తమ్ముడు అంటే పెద్ద రేంజ్ ఉంటుందని, హడావుడి ఎక్కువగా ఉంటుందని అనుకుందని రేణు దేశాయ్. కానీ పవన్ అప్పటికే వచ్చి సోఫాలో కూర్చున్నారు, చాలా సింపుల్‌గా కనిపించారు. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయిందట. ఆ తర్వాత తాను ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందట.
అలా రేణు దేశాయ్ `బద్రి` సినిమాలోకి అదే సమయంలో పవన్ కళ్యాణ్ జీవితంలోకి వచ్చింది. ఈ మూవీ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. చాలా కాలం సహజీవనం చేశారు.
పెళ్లికి ముందే అకీరా నందన్ జన్మించారు. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం కూతురు ఆధ్య జన్మించిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిన రెండేళ్ల(2012)లో రేణు, పవన్ విడిపోయారు.