ఇవన్నీ ఓ ప్లాన్ ప్రకారం చేయబోతున్నారట. దీని వెనకాల రాజమౌళి ఉన్నారట. మరి ఆయన పాత్ర ఏంటనేది చూస్తే, ఇది బన్నీలో ఉన్న కసి అని తెలుస్తుంది. `మగధీర` సమయంలో నిర్మాత అల్లు అరవింద్‌కి, రాజమౌళికి చిన్నపాటి డిఫరెన్సెస్ వచ్చాయి. ఆ సమయంలో రాజమౌళి హర్ట్ అయ్యారు.
ఆ తర్వాత బన్నీతో సినిమా చేయడానికి సుముఖత చూపించలేదు. దీంతో అప్పుడే బన్నీ డిసైడ్ అయ్యాడట. రాజమౌళితో సినిమా చేయకుండానే ఆయన రికార్డులు బ్రేక్ చేయాలని, తానేంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ ప్లాన్ లో భాగంగానే ఆయన ముందుకు వెళ్తున్నట్టు, ఇలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.