Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. కేవలం మూడు వారాలకే ఆమె బిగ్ బాస్ జర్నీ ముగియడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆమె నాగార్జునని అవమానించింది అనే వాదన కూడా వినిపిస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మూడవ వారం డాక్టర్ పాప ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. అగ్నిపరీక్ష దాటుకుని ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తప్పకుండా టాప్ 5 కంటెస్టెంట్ అవుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఊహించని విధంగా ప్రియా శెట్టి కథ మూడు వారాలకే ముగిసింది. ఆదివారం రోజు ఆమె ఎలిమినేట్ ఎలిమినేట్ అయింది. అగ్ని పరీక్షలో, బిగ్ బాస్ షో ప్రారంభంలో అందరినీ అట్రాక్ట్ చేసిన డాక్టర్ పాప పోరాటం ఎందుకు ఫ్లాప్ షోగా ముగిసింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
25
డాక్టర్ పాప ఎలిమినేట్ కావడం వెనుక కారణాలు
ఆమె మూడు వారాలకే ఎలిమినేట్ కావడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ప్రియా శెట్టి ఎలిమినేట్ కావడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆమె యాటిట్యూడ్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ బజ్ లో శివాజీ కూడా ఇదే విషయాన్ని బయట పెట్టారు. ప్రియా శెట్టిపై శివాజీ ప్రశ్నల వర్షంతో విరుచుకుపడ్డారు. ప్రియా శెట్టి యాటిట్యూడ్ ని ప్రశ్నిస్తూ ఒక ఫుటేజ్ ని శివాజీ చూపించారు. అది చూస్తే తప్పకుండా ప్రేక్షకులకు పుష్ప మూవీ గుర్తుకు వస్తుంది. పుష్ప మూవీలో హీరో యాటిట్యూడ్ ని తెలియజేసేలా ఒక డైలాగ్ ఉంటుంది. ' ఇది నా కాలు, ఇది కూడా నా కాలు.. నా కాలు మీద నా కాలు వేసుకుంటే ఓనికేమి నొప్పి అని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఉంటుంది.
35
హౌస్ లో పుష్పరాజ్ యాటిట్యూడ్
ఇదంతా ఎందుకంటే ప్రియా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఎదురుగా ఉన్నప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చుంది. ఆమెతో పాటు హరీష్, కళ్యాణ్, రీతూ చౌదరి కూడా కాలుమీద కాలేసుకుని కూర్చున్నారు. శివాజీ ప్రశ్నిస్తూ నాగార్జున గారి ముందు కూర్చునే విధానం అదేనా.. మిగిలిన వాళ్ళు ఎంత మర్యాదగా కుర్చున్నారో కనిపించలేదా అని ప్రశ్నించారు. తాను అంత ఆలోచించలేదని ప్రియా పేర్కొంది. అక్కడున్నది నాగార్జున గారా, వేరే వాళ్ళా అనేది పక్కన పెట్టండి. అక్కడ ఎవరున్నా అది ఈ షోకి హోస్ట్. ఆయనకి మర్యాద ఇవ్వడం కనీస బాధ్యత అని తెలియదా అంటూ శివాజీ.. ప్రియా శెట్టి చేసిన బిగ్ మిస్టేక్ ని ఎత్తిచూపారు.
ప్రియా శెట్టి చేసిన మరో తప్పుని కూడా శివాజీ ఎత్తి చూపారు. హౌస్ కి వెళ్లినప్పటి నుంచి కామనర్స్, సెలెబ్రిటీలు అనే విభేదాలని ప్రియా శెట్టి రెచ్చగొడుతూనే ఉంది అని తెలిపారు. నువ్వు అగ్ని పరీక్షతో కలిపి మొత్తం షోలో దాదాపు 2 నెలల వరకు ఉన్నావు. అంటే నువ్వు కూడా సెలెబ్రిటీనే అని శివాజీ తెలిపారు. నేను సెలెబ్రిటీని కాదు అనే ఫీలింగ్ తోనే ఇంత రచ్చ చేశావ్.. ఒక వేళ నువ్వు నిజంగానే సెలెబ్రిటీ అయితే ఇంకెత హంగామా చేసేదానివో అని శివాజీ అన్నారు. అసలు మీరు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లారు అని శివాజీ ప్రశ్నించారు.. ఆడి గెలవడానికి అని ప్రియా సమధానం ఇచ్చింది. గెలవడానికి అసలు మీరేం చేశారు అని ప్రశ్నించగా తనకి ఆడే అవకాశమే ఇవ్వలేదు అని ప్రియా తెలిపింది.
55
ప్రియా శెట్టి రెమ్యునరేషన్ ఇదే
అసలు నీకు ఆట ఆడడమే రాదు.. వెళ్లినప్పటి నుంచి కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నావు తప్ప గేమ్ ఆడలేదు అని శివాజీ అన్నారు. అగ్ని పరీక్షలో నీ కాన్ఫిడెన్స్ అందరికీ నచ్చింది. కానీ హౌస్ లోకి వెళ్ళాక అదే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది అని శివాజీ అన్నారు. నన్ను తొక్కేయడానికి ప్రశ్నించారు అని ప్రియా శెట్టి అన్నారు. దీని శివాజీ రియాక్ట్ అవుతూ నీ వాయిస్ తో నువ్వే అందరినీ తొక్కేశావ్ కదా అని శివాజీ కౌంటర్ ఇచ్చారు. అందుకే ఆడియన్స్ నిన్ను బయటకి పంపడానికి డిసైడ్ అయ్యారు అని శివాజీ అన్నారు. బిగ్ బాస్ హౌస్ షోకి గాను ప్రియా శెట్టికి మంచి రెమ్యునరేషన్ దక్కింది. వారానికి ఆమెకి రూ 70000 రెమ్యునరేషన్ చెల్లించారు. అంటే మూడు వారాలకు కలిపి ప్రియా శెట్టి రూ 210000 రెమ్యునరేషన్ అందుకుంది. ప్రియా శెట్టి వృత్తి రీత్యా డాక్టర్. కర్నూలుకి చెందిన అమ్మాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లో త్వరగానే ఆమె ప్రస్థానం ముగిసింది.