Bigg Boss Telugu 9: కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం రోజు ఎపిసోడ్ లో పండగ వాతావరణం కనిపించింది.చివర్లో ఎమోషనల్ గా ఎండ్ కావడం విశేషం.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం రోజు ఎపిసోడ్ లో పండగ వాతావరణం కనిపించింది. దసరా సంబరాల పేరుతో ఈ ఎపిసోడ్ ని స్పెషల్ గా మార్చేశారు. పలువురు సినీ తారలు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. కిరణ్ అబ్బవరం తన కె ర్యాంప్ మూవీ విశేషాలతో సందడి చేశారు. సిద్దు జొన్నలగడ్డ, రాశి కన్నా తెలుసు కదా మూవీ విశేషాలతో వచ్చారు. రితిక నాయక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అందించింది. ఇలా సంబరాలతో, సరదాలతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
25
ప్రియా శెట్టి అవుట్
చివర్లో ఎమోషనల్ గా ఎండ్ కావడం విశేషం. నామినేషన్స్ లో అతి తక్కువ ఓట్లతో చివర్లో ఉన్న ప్రియా, కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠకి తెరదించుతూ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ కంటే ముందు హౌస్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దసరా సంబరాల్లో భాగంగా నాగార్జున రీతూ చౌదరి, రాము, సంజన లకు ఫుడ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ ఫుడ్ కాంపిటీషన్ ఎంటర్టైనింగ్ గా సాగింది. రీతూ చౌదరి తినడం చూసి.. నాగ్ సార్ రీతూ వచ్చే దసరా వరకు ఇలాగే తినేలా ఉంది అంటూ ఇమ్మాన్యుయేల్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.
35
కెప్టెన్సీ టాస్క్
ఆ తర్వాత నాగార్జున ఐదుగురు సభ్యులని కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించారు. ఆ ఐదుగురు ఎవరంటే.. రీతూ చౌదరి, హరీష్, సంజన గల్రాని, డిమాన్ పవన్, రాము. ఈ ముగ్గురికి నాగార్జున ఓ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ పేరు బుట్టబొమ్మ. డిస్ప్లే లో కొన్ని వస్తువులు కనిపిస్తాయి. ఆ వస్తువులు వివిధ ప్రదేశాల్లో ఉంటాయి. వాటిని కెప్టెన్సీ కంటెండర్లు వేగంగా వెతికి తీసుకువచ్చి తమకి కేటాయించిన బుట్టల్లో వేసుకోవాలి. డిమాన్ పవన్ అత్యధిక వస్తువులని తన బుట్టలో వేసుకుని విజేతగా నిలిచాడు.
దీనితో నాగార్జున అతడిని విజేతగా ప్రకటించారు. దీనితో డిమాన్ పవన్ రెండవసారి హౌస్ కి కెప్టెన్ అయ్యారు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం వేదికపైకి ఎంట్రీ ఇచ్చి నాగార్జునతో, హౌస్ మేట్స్ తో సరదాగా ముచ్చటించారు. కిరణ్ అబ్బవరం నాగార్జునకి తన కె ర్యాంప్ టీజర్ చూపించారు. ఆ తర్వాత అసలైన ఘట్టం మొదలయింది. నామినేషన్స్ లో ఉన్న ప్రియా శెట్టి, కళ్యాణ్ లని నాగార్జున యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. ఇద్దరి మధ్యలో ఒక సింహం ఉంటుంది. సింహం రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. సింహం ఎవరి వైపు ఆగి గర్జిస్తుందో వాళ్ళు సేఫ్ అని నాగార్జున తెలిపారు. కాసేపు సస్పెన్స్ తర్వాత సింహం కళ్యాణ్ వైపు ఆగి గర్జించింది. దీనితో కళ్యాణ్ సేఫ్ అని, ప్రియా ఎలిమినేటెడ్ అని నాగార్జున ప్రకటించారు.
55
భరణి సిల్లీగా నామినేట్ చేస్తారు
ఈ యాక్షన్ జరుగుతున్నంత సేపు కళ్యాణ్ ఓవర్ గా టెన్షన్ పడుతూ, ఏడుస్తూ కనిపించాడు. ప్రియా ఎలిమినేట్ అయ్యాక కళ్యాణ్ అతిగా ఏడవడం ప్రారంభించారు. దీనితో ప్రియా అతడిని ఓదార్చింది. ఎలిమినేట్ అయిన ప్రియా వేదికపై నాగార్జున వద్దకి వెళ్ళింది. నాగార్జున ఆమె జర్నీ చూపించారు. ప్రియా మాట్లాడుతూ తాను ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అసలు ఊచించలేదని పేర్కొంది. హౌస్ లో ఉన్న 5 గురికి డెవిల్ హార్న్స్ ఇవ్వాలని, దానికి కారణం చెప్పాలని నాగార్జున కోరారు. దీనితో ప్రియా ముందుగా డెవిల్ హార్న్ ని హరీష్ కి ఇచ్చింది. ఎవరైనా తనని తప్పు అంటే ఒప్పుకునే మనస్తత్వం లేదని ఆరోపించింది. ఆ తర్వాత హార్న్ ని తనూజకి ఇచ్చింది. ఆమెలో ఉన్న ఒకే ఒక్క లోపం ఎక్కువగా అలగడం అని ప్రియా పేర్కొంది. ఆ తర్వాత భరణి, కళ్యాణ్ లకు కూడా ప్రియా హార్న్స్ ఇచ్చింది. భరణి ప్రతి ఒక్కరినీ సిల్లీ రీజన్ తో నామినేట్ చేస్తారని ప్రియా తెలిపింది. ఇక కళ్యాణ్ గేమ్ పై ఫోకస్ చేయకుండా ఫ్రెండ్స్ ఆయనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడని తెలిపింది.