నందమూరి బాలకృష్ణ నటించిన ఒక భక్తిరస చిత్రం డిజాస్టర్ కావడం వెనుక ఊహించని కారణం ఉంది. ఆ సినిమా ఏంటి ? ఎందుకు ఫ్లాప్ అయింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
నందమూరి బాలకృష్ణ నటించిన గతంలో పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించారు. అదే విధంగా ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో కూడా నటించారు. బాలయ్య తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు పౌరాణిక చిత్రాలతో అప్పట్లో తిరుగులేని గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ స్థాయిలో బాలయ్య పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించలేదు కానీ కొన్ని సినిమాలు చేశారు.
25
బాలకృష్ణ పాండురంగడు మూవీ
అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రం తెరకెక్కించిన రాఘవేంద్ర రావు ఆ తర్వాత శ్రీరామదాసు మూవీ తెరకెక్కించారు. అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బాలయ్యతో రాఘవేంద్ర రావు పాండురంగడు అనే మూవీ రూపొందించారు. అప్పట్లో ఎన్టీఆర్ పాండురంగ మహత్యం అనే చిత్రంలో నటించారు. అది సంచలన విజయం సాధించింది. ఆ సినిమా స్ఫూర్తితోనే రాఘవేంద్ర రావు బాలయ్యతో పాండురంగడు తెరకెక్కించారు.
35
అందుకే అట్టర్ ఫ్లాప్
కానీ ఈ చిత్రం విమర్శల పాలైంది. భక్తి కంటే ఈ మూవీలో బూతు ఎక్కువైంది అనే విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా హీరోయిన్ టబు సన్నివేశాలు చాలా అసభ్యంగా ఉంటాయి. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. భక్తి సినిమాని అలా చేస్తే ఇలాంటి రిజల్ట్ తప్పదు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
పాండురంగడు చిత్రంలో బాలయ్య వ్యసనపరుడిగా, ఓ మహిళ మోజులో మునిగిపోయే వ్యక్తిగా నటించారు. అదే విధంగా శ్రీకృష్ణుడిగా కూడా కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగాని రాశపరిచింది. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రంలో కూడా భక్తి లేదు. ఒక వారియర్ సినిమాలాగా తీశారు. అందుకే ఆ సినిమా కూడా ఆడలేదు అని తమ్మారెడ్డి అన్నారు.
55
మోహన్ బాబుకి చెప్పా
తాను నేరుగా మోహన్ బాబుకి ఫోన్ చేసి అడిగినట్లు తమ్మారెడ్డి తెలిపారు. ఈ సినిమాని మీరు పట్టించుకున్నట్లు లేరు. పట్టించుకుని ఉంటే బాగానే ఉండేది అని మోహన్ బాబుతో తెలిపినట్లు తమ్మారెడ్డి అన్నారు.