Ram Charan: రాంచరణ్, ప్రభాస్ జాతకాల్లో అది లేదు.. అయినా ఎలా సాధ్యమైంది ? దెబ్బకు ఫ్యూజులు అవుట్

Published : Feb 02, 2026, 04:26 PM IST

ప్రభాస్, రాంచరణ్ జాతకాల్లో లేని అంశాలు కూడా వారి జీవితంలో జరిగాయి. ఆ సంఘటనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రాంచరణ్ కి కవల పిల్లలు పుట్టాక ఈ చర్చ ఎక్కువైంది. 

PREV
15
రాంచరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరోసారి తండ్రి అయ్యారు. ఇప్పుడు రాంచరణ్ కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మొదట రాంచరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార కుమార్తె జన్మించింది. ఇటీవల జనవరి 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. సెలెబ్రిటీల కి సంబంధించిన ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే వేణు స్వామి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైపోవడం ఖాయం. 

25
తరచుగా వార్తల్లో వేణు స్వామి 

ఎందుకంటే చాలా సందర్భాల్లో వేణు స్వామి తాను చెప్పినట్లే సెలెబ్రిటీల విషయంలో సంఘటనలు జరిగాయి అని చెప్పుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన అంచనా పూర్తిగా తప్పింది. వేణు స్వామి చెప్పిన జాతకం వర్కౌట్ కాలేదు. 

35
ప్రభాస్ కి వరుస ఫ్లాపులు 

ప్రభాస్ కి బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ లాంటి ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆ టైంలో వేణు స్వామి మాట్లాడుతూ.. ప్రభాస్ బాహుబలి చిత్రంతో కెరీర్ లో పీక్ స్టేజీకి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ప్రభాస్ కెరీర్ పతనమే తప్ప ఎదుగుదల ఉండదు. ఇక ప్రభాస్ కి సినిమాల్లో హిట్లు ఉండవు అని తేల్చేశాడు. జాతక పరంగా ప్రభాస్ కి అన్నీ పరాజయాలు అని వేణు స్వామి తేల్చేశారు. కానీ ప్రభాస్ అనూహ్యంగా సలార్ తో పుంజుకున్నారు. 

45
కల్కి సినిమా ఎలా హిట్టైంది ?

ఆ తర్వాత వచ్చిన కల్కి 2898 ఎడి మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో వేణు స్వామిని నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. మరోసారి వేణు స్వామికి అలాంటి పరిస్థితే ఎదురైంది. గతంలో రాంచరణ్ కి కుమార్తె పుట్టినప్పుడు ఆమె జాతకం చెబుతూ వేణు స్వామి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్లీంకార జాతకం చాలా అద్భుతంగా ఉందని.. ఆమె పుట్టుక వల్ల చిరంజీవికి, రాంచరణ్ ఉపాసన దంపతులకు బాగా కలసి వస్తుంది అని అన్నారు. 

55
రాంచరణ్ జాతకంలో లేనప్పుడు ఇది ఎలా సాధ్యం ?

కానీ రాంచరణ్ జాతక ప్రకారం ఇక మగ సంతానం పుట్టే అవకాశం లేదని అప్పట్లో అన్నారు. అంటే చిరంజీవి ఫ్యామిలిలో ఇక మగ సంతానం ఉండదు. రాంచరణ్ కి మగవారసులు ఉండరు అని పేర్కొన్నారు. కానీ తాజాగా రాంచరణ్ ఒక ఆడ, ఒక మగ కవల పిల్లలకు తండ్రి అయ్యారు. వేణు స్వామి చెప్పినట్లు రాంచరణ్ జాతకంలో మగ సంతానం లేకపోతే ఇది ఎలా సాధ్యం అయింది ? ప్రభాస్ కి ఇక విజయాలే ఉండవు అని చెప్పారు కదా.. మరి కల్కి సినిమా ఏంటి ? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. వేణు స్వామి చెప్పే జాతకం సరిగ్గా లేదు అని ట్రోల్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories