మోహన్ బాబు, ఆమధ్య టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే అప్పుడు ఈ మీటింగ్ తెలుగు రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యింది. అంతా రాజకీయంగా ఆలోచించారు కాని.. ఫ్యామిలీ పరంగా ఎవరూ ఆలోచించలేదు. చివరకు మీడియా కూడా కనిపెట్టలేక పోయింది వీరి కలయికకు కారణం ఏంటీ అని. అటు మోహన్ బాబు కూడా.. తాను నిర్మించిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం గురించి మాట్లాడడానికి మాత్రమే చంద్రబాబుని కలిశానని చెప్పి అందరిని నమ్మించారు.