ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్ వాళ్ళ బాబాయ్,సామ్రాట్ దగ్గరికి వెళ్లి ఎందుకు ఈ రోజు మీటింగ్ లు అన్నీ క్యాన్సిల్ చేసుకున్నావు? ఒక్కడివే ఉన్నావు అని అడగగా, నా ఇష్టం నేనే ceo నా ఇష్టం. అయినా నా వ్యాపార భాగస్వాములు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు భాగస్వామ్యాన్ని వదిలేసుకున్న పర్లేదు నేను మాత్రం ఒక రోజు కూడా సెలవు తీసుకోకూడదా అని మండిపడుతూ ఉంటాడు. ఇంతటిలో నందు,లాస్య లు అక్కడికి వస్తారు.సామ్రాట్ చాలా కోపంగా ఉంటాడు.