రవితేజ హీరోగా నటించిన `మాస్ జాతర` మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. నూతన దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. నాగవంశీ నిర్మించారు. సుమారు రూ.90కోట్ల బడ్జెట్‌తో మూవీని రూపొందించినట్టు సమాచారం. భీమ్స్ సంగీతం అందించగా, ఇందులో రాజేంద్రప్రసాద్, సముద్రఖని, మురళీ శర్మ, హైపర్ ఆది, రచ్చ రవి, ఇమ్మాన్యుయెల్, నరేష్, అజయ్ ఘోష్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. నవీన్ చంద్ర విలన్ పాత్రలో నటించారు. మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. కామెడీ కొంత వరకు వర్కౌట్ అయ్యింది. యాక్షన్ సీన్లు మెప్పించాయి. రాజేంద్రప్రసాద్ పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఇందులో వింటేజ్ రవితేజని చూపించారు. కానీ రొటీన్ కమర్షియల్ మూవీ అనే టాక్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తోంది.