రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, పెద్ది నుంచి సాలిడ్ అప్ డేట్ తో రెడీగా ఉన్న టీమ్..

Published : Nov 01, 2025, 06:12 PM IST

గెడ్ రెడీ మెగా ఫ్యాన్స్... రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి మరో అప్ డేట్.. సర్ ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ పెద్ది నుంచి ఏం రిలీజ్ కాబోతోంది. ? 

PREV
14
స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పాన్-ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

24
పెరుగుతోన్న అంచనాలు

ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి రెండు డిజాస్టర్ల తరువాత.. పెద్ది సినిమా హిట్ అవ్వడం చరణ్ కు చాలా ఇంపార్టెంట్ అయ్యింది. దాంతో మెగా హీరోపై ఈప్రెజర్ ఎక్కుంగా ఉంది. ఎలాగైన ఈసినిమాతో హిట్ కొట్టాలని రామ్ చరణ్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. మెగా అభిమానుల్లో కూడా ఈసినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, లుక్స్, ప్రోమో వీడియోలు పెద్దిపై అంచనాలు భారీగా పెంచాయి.ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ పై హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సాంగ్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 8న ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు బుచ్చిబాబు తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

34
రెహమాన్ కాన్సర్ట్ లో

పెద్ది ఫస్ట్ సాంగ్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగనున్న ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం భారీ స్థాయిలో జరగనుందని సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ ఈవెంట్‌కు భారీ స్థాయిలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. దాంతో ఈ పాటను ఈ సందర్భంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది.

44
మెగా ఫ్యాన్స్ లో సంతోషం

‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ గా ప్రేమ గీతాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. లవ్ ట్రాక్‌ అని తెలియగానే చరణ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. బుచ్చిబాబు ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే మెగా అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్ది సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిసింది. ఇక తాజాగా రిలీజ్ చేయబోయే సాంగ్ తో.. పెద్ది ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories