మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాంచరణ్ 2వ చిత్రం కావడంతో రాజమౌళి మగధీర మూవీని దృశ్య కావ్యంలా తెరకెక్కించారు. నిర్మాతగా అల్లు అరవింద్ ఈ చిత్రం కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ లో రూపొందిన మగధీర చిత్రం బాలీవుడ్ సైతం నివ్వెరపోయేలా 80 కోట్ల వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
DID YOU KNOW ?
మగధీరలో చిరంజీవి మూవీ సీన్
చిరంజీవి కొదమ సింహం చిత్రంలో గుర్రంతో ఒక సన్నివేశం ఉంటుంది. ఇసుకలో పీకల్లోతు కూరుకుపోయిన చిరంజీవి గుర్రం రక్షిస్తుంది. ఆ గుర్రానికి చిరంజీవి కృతజ్ఞతగా డైలాగ్ చెప్పకపోవడం రాజమౌళికి నచ్చలేదట. అందుకే అలాంటి సన్నివేశాన్ని మగధీరతో పెట్టి రాంచరణ్ తో జక్కన్న గుర్రానికి కృతజ్ఞత చెప్పించారు.
25
16 ఏళ్ళు పూర్తి చేసుకున్న మగధీర
ఈ చిత్రం విడుదలై 16 ఏళ్ళు పూర్తయింది. 2009 జూలై 30న ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో మగధీర విశేషాలని గుర్తు చేసుకుంటున్నారు. మగధీర చిత్రం రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ షోని మెగా ఫ్యామిలీతో పాటు, చిత్ర పరిశ్రమలో ప్రముఖులు కూడా వీక్షించారు. ఈ మూవీలో పునర్జన్మల నేపథ్యంలో కథ, గుర్రపు స్వారీ సన్నివేశాలు, 100 మంది వీరులతో పోరాటం, శ్రీహరి పాత్ర, రాంచరణ్ కాజల్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచాయి.
35
పోకిరి రికార్డులు బ్రేక్
అంతకు ముందు టాలీవుడ్ లో పోకిరి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా ఉండేది. పోకిరి కలెక్షన్లని మగధీర చిత్రం డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా మగధీర చిత్రం సినీ అభిమానులని, టాలీవుడ్ సెలెబ్రిటీలని మాత్రమే కాదు క్రీడా ప్రముఖుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కి మగధీర చిత్రం ఆల్ టైం ఫేవరిట్ మూవీ అట. ఈ విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్ ఓ సందర్భంలో తెలిపారు. క్రికెటర్ హనుమ విహారితో కలసి అశ్విన్ ఓ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ చిట్ చాట్ లో అశ్విన్ తనకు తెలుగు సినిమాల గురించి చెప్పమని విహారిని అడిగారు.
55
అశ్విన్ చెప్పిన తెలుగు సినిమా విశేషాలు
దీనితో విహారి రీసెంట్ గా తాను చూసిన చిత్రాల గురించి చెప్పాడు. మీకు తెలుగులో ఇష్టమైన మూవీ ఏంటి అని అశ్విన్ ని అడిగారు. దీనితో అశ్విన్ ఏమాత్రం తడబాటు లేకుండా నా ఆల్ టైం ఫేవరిట్ మూవీ మగధీర అని చెప్పారు. అప్పుడప్పుడూ తాను తెలుగు సినిమాలు చూస్తుంటానని.. తన కుటుంబ సభ్యులకు అయితే తెలుగు సినిమాలు అంటే పిచ్చి అని అశ్విన్ పేర్కొన్నారు. అడివి శేష్ ఎవరు చిత్రాన్ని కూడా తాను చూశానని వెరీ గుడ్ మూవీ అని ప్రశంసించారు. అదే విధంగా మహేష్ బాబు ఒక్కడు మూవీ అంటే కూడా తనకి ఇష్టం అని అశ్విన్ పేర్కొన్నారు.