రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?

Published : Dec 21, 2025, 09:30 AM IST

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రవితేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా.. అభిమానులు మాస్ మహారాజుగా పిలుచుకునే ఈ హీరో నిర్ణయం వెనుక కారణం ఏంటి?

PREV
15
ఒక్కో మెట్టు ఎక్కుతూ..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా రవితేజ ఉన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన రవితేజ.. హీరోగా మారి ఇండస్ట్రీలో దూసుకుపోయాడు. సినిమా కష్టాలేంటో బాగా తెలిసిన హీరో రవితేజ. సామాన్య ప్రేక్షకుల నుంచి ఎదిగిన స్టార్ట్ రవితేజ. అందుకే ప్రేక్షకులు ఆయన్ను ప్రేమగా ‘మాస్ మహారాజ్’ అని పిలుస్తారు. ఆయన హీరోగా తెరకెక్కే ప్రతి సినిమాకు ఈ ట్యాగ్ ఒక గుర్తింపులా మారింది. ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి, కిక్, లాంటి సినిమాల్లో రవితేజ అల్లరి, మాస్ పెర్ఫామెన్స్ ఆయనకు ఎంతో గుర్తింపును తీసుకువచ్చింది.

25
రవితేజ సంచలన నిర్ణయం..

రవితేజ్ సినిమాలు యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకర్శించాయి. ఆయన యాటిడ్యూడ్ కు ఎక్కువగా అభిమానులు  ఉన్నారు. అయితే తాజాగా రవి తేజ తన మాస్ మహారాజ ట్యాగ్ ను దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ట్యాగ్‌ను ఉపయోగించవద్దని తన సినిమా టీమ్ కు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి.. అసులు దీనికి కారణం ఏంటీ అని అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటన్నది తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. ఈ విషయంపై రీసెంట్ గా దర్శకుడు కిషోర్ తిరుమల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

35
భర్త మహాశయులకు విజ్ఞప్తి

రవితేజ హీరోగా.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ జోడీగా డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ రీసెంట్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

45
క్లారిటీ ఇచ్చిన రవితేజ డైరెక్టర్

“ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కథను ముందుగా రవి తేజ గారికే చెప్పాను. కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా వేరే హీరోతో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆయనతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అనిపించింది సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. ఆడియన్స నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అనిపించింది. నా సినిమాల్లో నేను ఎప్పుడూ.. కథలో పాత్రలను బట్టే ముందుకు వెళ్తాను.. అది గమనించి రవితేజ గారు ఈ సినిమా వరకూ.. ‘మాస్ మహారాజ్’ అనే ట్యాగ్ తీసేద్దాం అని చెప్పారు” అంటూ కిషోర్ తిరుమల వెల్లడించారు.

55
పక్కా ఫ్యామిలీ పాత్రలో రవితేజ..

భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజ పాత్రకు.. మాస్ మహారాజ్ ట్యాగ్ కు సూట్ కాదు అనిపించి.. ఈసినిమా వరకూ ఆ ట్యాగ్ వాడొద్దు అన్నారట రవితేజ. తన ఇమేజ్‌ను కథకు తగ్గట్టుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు రవితేజ. తన జానర్ ను కాస్త చేంజ్ చేసి..హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఈసారి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో ఆయన పూర్తి స్థాయి ఫ్యామిలీ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న రవితేజకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories