Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి

Published : Dec 20, 2025, 11:02 PM IST

బిగ్ బాస్ హౌస్ లో చివరి రోజు.. టాప్ 5 కంటెస్టెంట్స్ చాలా సరదాగా గడిపారు. వారి కోసం బిగ్ బాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను ఏర్పాటు చేశాడు. ఈక్రమంలో డీమాన్ పవన్ అడ్డంగా బుక్ అవ్వగా..ఇమ్మాన్యుయేల్ తో ప్రదీప్ చెడుగుడు ఆడేశాడు. తనూజతో ఇమ్ము ఏమన్నాడంటే?

PREV
15
బిగ్ బాస్ హౌస్ లో చివరి రోజు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి రోజు చాలా సరదాగా గడిచింది. హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ ను ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ రకరకాల ఈవెంట్స్ ను ఏర్పాటు చేశాడు. అందరు చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. హీరో శివాజీ లయ బ్యాచ్ ఒక సారి, ప్రదీప్, శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్, హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ తో సరదాగా గడపడటంతో పాటు.. వారితో ఓ ఆట ఆడేసుకున్నారు. మరీ ముఖ్యంగా ప్రదీప్ ఇమ్మాన్యుయెల్ తో చెడుగుడు ఆడేసుకున్నాడు. తనూజ చేత ఇమ్మాన్యుయెల్ ఐటమ్ సాంగ్ చేయిస్తానని అన్నాడు. డీమాన్ పవన్ ను రీతూ విషయంలో అడ్డంగా బుక్ చేశాడు శివాజీ.

25
తనూజతో కిస్సిక్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్

బిగ్ బాస్ హౌస్ లో చివరి రోజు సందడి చేసిన గెస్ట్ లలో శ్రీముఖి కూడా ఒకరు. ఆమె హౌస్ లోకి రాగానే అంత సందడి గా మారింది. వచ్చీ రావడంతోనే హౌస్ లో ఉన్న వారికి చిన్న టాస్క్ కూడా ఇచ్చింది. కళ్యాణ్ పడాల రంగస్థలంలో చిట్టిబాబుగా, తనూజ ఫిదాలో భానుమతిగా, ఇమ్మాన్యుయేల్ పుష్పలో పుష్పరాజ్ గా క్యారెక్టర్స్ చేస్తూ.. ఒక సీన్ చేయాలని చెప్పింది. వారు ముగ్గరు తమ పాత్రలను అద్భుతంగా చేశారు. ఈక్రమంలో ఇమ్మాన్యుయెలో పుష్ప పాత్రలో ఉండటంతో..భానుమతిగా ఉన్న తనూజను తీసుకెళ్లి.. కిస్ కిస్ కిస్సుక్కు సాంగ్ కు డ్యాన్స్ చేయిస్తానని పలు మార్లు అన్నాడు. ఓ రెండు సార్లు చూసిన తనూజ..మూడో సారి ఇమ్మాన్యుయెల్ లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసింది.

35
అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్

ఈ సీజన్ లో బిగ్ బాస్ బజ్ చేస్తున్నాడు శివాజీ. ఎలిమినేట్ అయిన కంటెస్టంట్లను తన ఇంటర్వ్యూలో ఒక ఆట ఆడుకుంటాడు. బిగ్ బాస్ చివరి రోజు శివాజీ కూడా సందడి చేశాడు. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా.. హీరోయిన్ లయతో పాటు హౌస్ లో అడుగు పెట్టినశివాజీ.. సీక్రెట్ రూమ్ నుండి ఒక్కసారిగా బయటకు రావడంతో టాప్ 5 కంటెస్టంట్స్ అవాక్కయ్యారు. శివాజీ రాకతో హౌస్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈక్రమంలో డీమాన్ పవన్ ను ఒక ఆట ఆడుకున్నాడు శివాజీ. తనదైన మార్కు సెటైర్లు, చమత్కారాలతో నవ్వులు పూయించాడు. డీమాన్ పవన్ , రీతు గతంలో ఎలా ఉండేవారు. వారి మధ్య జరిగిన ప్రేమ సన్నివేశాన్ని శివాజీ , లయ చేసి చూపించారు. వారి పెర్ఫామెన్స్ ను చాలా జాగ్రత్తగా గమనించిన డీమన్ సిగ్గుపడటం ప్రత్యేకంగా అనిపించింది. తాము ఇలా చేశామా అని అతనికే ఆశ్చర్యం అనిపించింది.

45
ఇమ్మాన్యుయేల్ ను ఆటాడేసుకున్న ప్రదీప్

యాంకర్ ప్రదీప్ హౌస్ లోకి వచ్చి సందడి చేశాడు. వచ్చీరావడంతోనే ఇమ్మాన్యుయెల్ పై సెటైర్లు వేశాడు. గతంలో ఇమ్ము దగ్గరకు వస్తే..ముందు పొట్ట వచ్చేది, ఆతరువాత వాడు వచ్చేవాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇమ్మాన్యుయెల్ వచ్చాడు అంటూ.. ర్యాగింగ్ చేశాడు. హౌస్ లో ఉన్నవారితో సరదాగా కొన్ని గేమ్స్ కూడా ఆడించాడు ప్రదీప్. అంతే కాదు ఫైనల్ గా ప్రదీప్, శ్రీముఖి కలిసి.. బిగ్ బస్ టాప్ కంటెస్టెంట్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ ఈవెంట్ ను నడిపించారు. వారి మనసులో మాటలను బయటు తీశారు.

55
గ్రాండ్ ఫినాలే నుంచి ఇద్దరు ఔట్..

గ్రాండ్ ఫినాలకు ముందు ఇలా ఎనర్జిటిక్ ఎపిసోడ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. ఇక తాజా సమాచారం ప్రకారం ఫైనల్ రేస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు వెళ్లిపోయిన్టు తెలుస్తోంది. ముందుగా సంజనా ఎలిమినేట్ అవ్వగా.. ఆతరువాత ఇమ్మాన్యుయేల్ కూడా ఎలిమినేట్ అయ్యి బయటు వెళ్ళిపోయాడు. హౌస్ లో కళ్యాణ్, తనూజ, పవన్ ఉన్నారు. వారిలో విన్నర్ రన్నర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కళ్యాణ్ తనూజ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంచి. మరి ఈ జాగ్ బాస్ తెలుగు సీజన్ టైటిల్ గెలిచేది ఎవరో చూడాలి. కళ్యాణ్ పడాలకే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నట్టు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories