చిరంజీవి సినిమాల్లోకి రావడం, హీరో కావడానికి కారణం ఒక సూపర్ స్టార్. ఆయన చెప్పిన మాట వల్లే మెగాస్టార్ మద్రాస్ వెళ్లడం, ఆ తర్వాత శిక్షణ తీసుకోవడం, అట్నుంచి హీరోగా మారిపోవడం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ఎంతో స్ట్రగుల్ అయి, స్వయంకృషితో ఎదిగిన హీరో. ఎంతో హార్డ్ వర్క్ తో తనని తాను మలుచుకొని తిరుగులేని సూపర్ స్టార్‌గా, ఆ తర్వాత మెగాస్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ అదే స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. ఎంత మంది తర్వాత తరం హీరోలు వచ్చినా తన స్థానం చెక్కు చెదరలేదంటే అది ఆయన గ్రేట్‌నెస్‌కి నిదర్శనం. అయితే చిరంజీవి హీరో కావడం వెనుక.. సినిమాల్లోకి రావడం వెనుక ఒక సూపర్ స్టార్ ఉన్నారు. ఆయన చెప్పిన ఒక్క మాటతోనే చిరంజీవి లైఫ్ మారిపోయింది. మరి ఆ సూపర్ స్టార్ ఎవరనేది చూస్తే.
24
రజనీకాంత్, జీవీ నారాయణరావుని కలిసిన చిరంజీవి
చిరంజీవి `పునాదిరాళ్లు` మూవీతో హీరోగా మారిన విషయం తెలిసిందే. `ప్రాణంఖరీదు` చిత్రంతో మొదట హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇది 1978లో విడుదలైంది. అయితే ఈ మూవీకంటే ముందు ఆయన సినిమాల్లోకి రావడానికి ఒక హీరో కారణమయ్యారు. ఆ వివరాలు చూస్తే, 1977లో `చిలకమ్మ చెప్పింది` సినిమా వచ్చింది. ఇందులో జీవీ నారాయణరావు హీరోగా నటించారు. రజనీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో షూటింగ్ చూడ్డానికి వెళ్లారు చిరంజీవి. సెట్‌లో రజనీకాంత్, జీవీ నారాయణరావు ఉన్నారు. వారిని కలిశారు చిరంజీవి.
34
రజనీకాంత్ చెప్పిన మాటతో చిరంజీవి లైఫ్ ఛేంజ్
ఆ సమయంలో వీరి వద్ద చిరంజీవి సినిమాల్లోకి రావాలనే తన ఇంట్రెస్ట్ ని చూపించారు. చిరు ఇంట్రెస్ట్ ని గమనించిన రజనీకాంత్ కలగజేసుకొని ఒక మాట చెప్పారట. సినిమాల్లోకి రావాలంటే ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకోవాలని, మేం అలానే వచ్చామని, మద్రాస్‌లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఉందని, అందులో చేరాలని రజనీకాంత్ చెప్పారట. ఆ మాట విని చిరంజీవి నేరుగా మద్రాస్ వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ అక్కడే ట్రైన్ అవుతున్నారు. ఆయన చిరంజీవికి సీనియర్. నటనలో శిక్షణ కూడా ఇచ్చాడట. కానీ ట్రైనింగ్ అయిన ఏడాదికే చిరంజీవికి సినిమా ఛాన్స్ వచ్చింది. అదే `పునాది రాళ్లు` చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ తర్వాత `ప్రాణం ఖరీదు` సినిమా వచ్చింది. ఇది మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. `ఖైదీ` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇది తొలి బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఇప్పుడు 156సినిమాలు చేశారు చిరంజీవి. 157వ మూవీ విశ్వంభర రిలీజ్ కావాల్సింది. ప్రస్తుతం 158వ మూవీ బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. దీనికి `కాకా` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా దీని గ్లింప్స్ విడుదల చేయగా, ఆకట్టుకుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.