Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..

Published : Aug 27, 2026, 10:46 AM IST

Prabhas: మూడు గంటల సినిమా ను ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చూస్తుంటారు కానీ ఆ సినిమా వెనుక ఎంత మంది ఎన్నిరిస్క్ లు చేస్తారో వారికి తెలియదు. ఒక్కొసారి ప్రణాలకు తెగించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితినుంచి తన స్నేహితుడిని ప్రభాస్ ఎలా కాపాడుకున్నాడో తెలుసా?

PREV
14
ప్రాణాలకు తెగించాల్సి ఉంటుంది

సినిమా తెరపై గూస్ బామ్స్ తెప్పించే యాక్షన్ సీన్స్, అడ్వెంచర్ సీన్స్ వెనుక నటీనటులు, సాంకేతిక నిపుణులు పడే కష్టం, కొన్నిసార్లు వారి ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ముఖ్యంగా భారీ యాక్షన్ చిత్రాల షూటింగ్ టైమ్ లో ఊహించని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం 'ఛత్రపతి' షూటింగ్ టైమ్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక భయంకర ప్రమాదం గురించి, ప్రభాస్ తన స్నేహితుడు ప్రాణాలు ఎలా కాపాడన్న విషయం గురించి స్వయంగా ఆ నటుడే ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. అతను ఎవరో కాదు ఛత్రపతి శేఖర్.

24
నీటి అడుగున ప్రమాదకరమైన సీన్

ఛత్రపతి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇంట్రడక్షన్ సీన్ కోసం నీటిపై నడిచే పెద్ద ఫిషింగ్ బోట్లు, చిన్న తెప్పల మధ్య సాగుతోంది. ఒక పక్క డైరెక్టర్, కెమెరా టీమ్ బోట్ పైనుండి సీన్‌ను నడిపిస్తుంటే.. ప్రభాస్ తో పాటు ఆయన ఫ్రెండ్స , శేఖర్ లాంటి మరికొందరు షిప్ మీద ఉన్నారు. శేఖర్ నీటి అడుగున ఊపిరి బిగబట్టి ఉండవలసి వచ్చింది. డైరెక్టర్ 'యాక్షన్' చెప్పగానే నీటి పైకి రావడం ఆ సీన్ సారాంశం. అయితే బోట్ క్రింద భాగంలో ఉన్న ప్రొపెల్లర్ (ఫ్యాన్) చక్రం వేగంగా తిరుగుతూ నీటిని లోపలికి గుంజుతోంది, ఇది ప్రమాదాన్ని మరింత పెంచింది.

ప్లాన్ ప్రకారం శేఖర్ నీటి పైకి రాగానే నటుడు అజయ్ ఆయన కాలర్ పట్టుకోవాలి, నీటి లోపల ఉన్న ప్రభాస్ కాళ్లను పట్టుకుని సపోర్ట్ చేయాలి. కానీ నీటి నుంచి పైకి లేచే క్రమంలో అజయ్ కాలర్ పట్టుకోవడం మిస్ అయింది . పైకి రాగానే ఆయన కేవలం ఒక్క క్షణం మాత్రమే ఊపిరి తీసుకోగలిగారు, ఆ వెంటనే బోట్ ప్రొపెల్లర్ ఫ్యాన్ ఆయన్ను లోపలికి లాగడం ప్రారంభించింది. దాంతో శేఖర్ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది.

34
ప్రాణాలకు తెగించి శేఖర్ ను కాపాడిన ప్రభాస్

మనిషి నీటిలో జారిపోతున్నాడని గ్రహించిన ప్రభాస్, ఆయన కాళ్లను, ఆ తర్వాత ప్యాంట్‌ను గట్టిగా పట్టుకుని అస్సలు వదల్లేదు. నీళ్లు చేతులపై పడుతున్నా, జారిపోతున్నా ప్రభాస్ తన శక్తినంతా ఉపయోగించి శేఖర్‌ను లాగడానికి ప్రయత్నించారు . ఆ క్షణంలో ప్రభాస్ చూపిన సమయస్ఫూర్తి, పట్టుదలే శేఖర్ ను నీటి లోపలికి కొట్టుకుపోకుండా ఆపగలిగింది జారిపోతున్న సమయంలో ఎలాగైనా ఏదో ఒక ఆధారాని పట్టుకోవాలనే ఉద్దేశంతో శేఖర్ చేతులు పైకి ఎత్తారు . చివరకు ఊగుతున్న బోటు అంచు (ఎడ్జ్) చేతికి దొరకడంతో దాన్ని పట్టుకుని పైకి లేచి విపరీతమైన భయం మధ్య ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్లలోనే ప్రాణాపాయం వచ్చి వెళ్ళిపోయింది.

44
ప్రభాస్ వల్లే ఇప్పుడు ఇలా బ్రతికి ఉన్నా..

చత్రపతి షూటింగ్ టైమ్ లో జరిగిన ఈ సన్నివేశం తన ప్రాణాల మీదకు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఛత్రపతి శేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రభాస్ అప్పుడు అలా పట్టుకుని కాపాడకపోయి ఉంటే.. ఈరోజు తాను ఇలా బ్రతికి ఉండేవాడిని కాదు అని శేఖర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎంత క్లిష్టమైనప్పటికీ, తోటి స్నేహితుడిని కాపాడటానికి ప్రభాస్ చూపిన మానవత్వం, ధైర్యం అభినందనీయం. తెరపై మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్ హీరో అని ఈ ఘటన నిరూపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories