ఫ్లాప్ అని మధ్యలోనే తెలుస్తుంది, సెకండ్ హాఫ్ కథ వినకుండా ఓకె చేసిన రవితేజ.. కట్ చేస్తే మూవీ బ్లాక్ బస్టర్

First Published | Aug 11, 2024, 9:17 PM IST

ఒక సినిమా రిలీజ్ అయితే అది హిట్టా, ఫ్లాపా అని పట్టించుకుకొను అని రవితేజ తెలిపారు. ఆ మూవీ కోసం ఏం చేయాలో అంతా చేస్తాం.. ఒక సారి కంప్లీట్ అయ్యాక అది అనవసరం అని రవితేజ అన్నారు.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఆగష్టు 15న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో మిస్టర్ బచ్చన్ చిత్రానికి సంబంధించిన విశేషాలు, రవితేజకి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో రవితేజ తాను జయాపజయాలని ఎలా తీసుకుంటానో అని వివరించారు. 

ఒక సినిమా రిలీజ్ అయితే అది హిట్టా, ఫ్లాపా అని పట్టించుకుకొను అని రవితేజ తెలిపారు. ఆ మూవీ కోసం ఏం చేయాలో అంతా చేస్తాం.. ఒక సారి కంప్లీట్ అయ్యాక అది అనవసరం అని రవితేజ అన్నారు. ఫ్లాప్ అయితే కుంగిపోను. కొన్ని చిత్రాలు చేస్తున్నప్పుడు మధ్యలోనే అర్థం అయిపోతుంది.. ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని. కానీ సగం పూర్తయ్యాక ఏమి చేయలేము అని రవితేజ అన్నారు. 

Also Read : మేకప్ తీసేస్తే నల్లగా ఉంటా, నీ ఇష్టం..ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్


సినిమా బిజినెస్ విషయంలో నిర్మాత ఎంత భాద్యతగా ఉంటారో నేను కూడా అంతే భాద్యతగా ఉంటా. నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు రాకూడదు అని కోరుకుంటా. వాళ్ళ కష్టానికి తగ్గ లాభం వస్తే చాలు. అంతకంటే ఎక్కువ వస్తే అది బోనస్ అని రవితేజ అన్నారు. 

Also Read: అక్కినేని కోడలిపై సెటైర్ వేసిన మహేష్ బాబు..దెబ్బకి బ్యాగ్రౌండ్ మొత్తం బయటకి తీసింది

స్క్రిప్ట్ విషయంలో ఎంతలా ఇన్వాల్వ్ అవుతారు అని ప్రశ్నించగా రవితేజ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎక్కువగా నేను స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ కాను. నా వరకు కథ కోసం ఏమి మార్చుకోగలనో అని ఆలోచిస్తా. కిక్ సినిమా కథని వక్కంతం వంశి నాకు ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పాడు. క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ అసలు వినలేదు. 

Also Read : పెళ్లి తర్వాత ఫస్ట్ టైం హీరోలు నటించిన చిత్రాలు..చిరు, వెంకీ, మహేష్ తో పాటు వీళ్ళ జాతకమే మారిపోయింది

ఎందుకంటే కథ ఫ్లో నాకు అర్థం అయింది. నమ్మి ఆ సినిమా చేశా. కిక్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికి తెలుసు. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో కిక్ ఒకటి. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 

Latest Videos

click me!