రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలొస్తున్న టైంలో.. ఆమె మాజీ ప్రియుడు, నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్‌మెంట్ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో రక్షిత్ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తన బాయ్‌ఫ్రెండ్ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఆదివారం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు స్టార్ కపుల్. ఇక ఈ టైంలోనే శాండల్‌వుడ్ స్టార్ రక్షిత్ శెట్టి పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. ఎందుకంటే, గతంలో రష్మికకు, రక్షిత్ శెట్టికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ పెళ్లి వరకు వెళ్లలేదు. అందుకే ఇప్పుడు రక్షిత్ పేరు మళ్లీ వినిపిస్తోంది.
26
సోషల్ మీడియాకు దూరం
2018లో రష్మికతో బ్రేకప్ అయ్యాక, రక్షిత్ శెట్టి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. ఈ నేపథ్యంలోనే, 2018లో ఈ విషయంపై పెద్ద చర్చ జరిగినప్పుడు రక్షిత్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
36
రక్షిత్ శెట్టి ఏం చెప్పారు?
ఆ పోస్టులో రక్షిత్ శెట్టి ఇలా రాశారు: "నేను నా పని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. అందుకే సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంటున్నాను. దీనికి, రష్మిక మందన్నతో నా బంధానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి రెండింటినీ కలపకండి. మీ అంతట మీరే ఏదో ఒకటి ఊహించుకోవద్దు" అని ఆయన స్పష్టం చేశారు.
"గౌరవనీయులారా, నేను ఇతర పనులపై దృష్టి పెట్టడానికి సోషల్ మీడియా నుండి తప్పుకుంటున్నానని ప్రకటించాను. కానీ కొన్ని విషయాలు స్పష్టం చేయడానికి మళ్లీ రావాల్సి వచ్చింది" అని రక్షిత్ వివరణ ఇచ్చారు. అదే పోస్టులో, "నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి. ఏమీ ప్రశ్నించవద్దు" అని కోరుతూ, తాను పడుతున్న బాధను పరోక్షంగా తెలిపారు.
56
రష్మిక చెప్పిన కారణం ఇదే
రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ రద్దయినప్పుడు, ఈ జంట గురించి చాలా చర్చ జరిగింది. కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు, తల్లిదండ్రులతో చర్చించి రష్మిక ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, అసలు కారణం ఏంటనేది మాత్రం బయటకు రాలేదు.
66
నేషనల్ క్రష్‌పై తీవ్ర ఆరోపణలు
శాండల్‌వుడ్‌లో ఎంట్రీ కోసమే రష్మిక.. రక్షిత్‌ను వాడుకున్నారనే ఆరోపణలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి. జూలై 2017లో రక్షిత్, రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం 'కిరిక్ పార్టీ'తోనే రష్మిక కన్నడ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. కానీ, చివరికి ఆ బంధం ముగిసిపోయింది.