మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?

Published : Feb 23, 2026, 01:13 PM IST

టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా నార్త్ లో మన హీరోలకు ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఇండియన్ క్రికెట్ టీమ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ కు వీరాభిమాని అయిన స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? 

PREV
14
తెలుగు హీరోలకు నార్త్ లో ఫాలోయింగ్..

రాజమౌళి పుణ్యమా అని తెలుగు హీరోల హవా నార్త్ ఇండియాలో కూడా వెలిగిపోతోంది. అక్కడ కూడా మన హీరోలకు భారీగా అభిమానులు పెరిగిపోయారు. మన సినిమాలు చూడటం మొదలు పెట్టారు. మరీముఖ్యంగా తెలుగు నుంచి హిందీ డబింగ్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. 

దాంతో తెలుగునుంచి పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న హీరోంలంటే సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ ఎంతో మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యగా ఇండియాన్ క్రికెట్ టీమ్ లో కూడా మన హీరోలకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ శివమ్ దూపేకు టాలీవుడ్ లో ఇద్దరు హీరోలంటే చాలా ఇష్టమట.

24
సిక్సర్ల వర్షం కురిపించిన శివమ్ దూబే

ప్రస్తుతం జరుగుతున్న ICC T20 World Cupలో యువ భారత క్రికెటర్ శివమ్ దూబే తన సిక్సర్ల వర్షంతో ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇస్తూ... ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. పవర్ హిట్టింగ్‌తో పాటు బౌలర్ గా కూడా కీలక పాత్ర పోషిస్తూ.. జట్టుకు విశ్వసనీయ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నారు.ఇటీవల మీడియాతో జరిగిన సంభాషణలో శివమ్ దూబే తనకు తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించారు.

34
మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే ఇష్టం..

ముఖ్యంగా మహేష్ బాబు తనకు అత్యంత ఇష్టమైన నటుడని తెలిపారు. “మహేష్ బాబు చాలా క్లాసీగా, హ్యాండ్సమ్‌గా ఉంటారు” అని దూబే వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆయన మహేష్ బాబు సినిమాలను తరచూ చూస్తానని, ఆయన స్టైల్ , స్క్రీన్ ప్రెజెన్స్ తనకు ఎంతో నచ్చుతాయని చెప్పారు. 

మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ పట్ల కూడా తనకు అభిమానం ఉందని శివమ్ దూబే పేర్కొన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ డాన్స్ మూవ్స్ తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆయన నటించిన Pushpa సినిమా తనకు బాగా నచ్చిందని వెల్లడించారు. అలాగే తాను తరచూ హిందీ డబ్ చేసిన తెలుగు సినిమాలను చూస్తానని కూడా తెలిపారు.

44
తెలుగు హీరోలను అభిమానించే క్రికెటర్స్..

ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వరణాసి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. 2026 ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ దర్శకులు అట్లీ , లోకేష్ కనగరాజ్లతో పలు ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. శివమ్ దూబే మాత్రమే కాకుండా, ఇతర క్రికెటర్లు కూడా తెలుగు సినీ తారలపై అభిమానాన్ని వ్యక్తం చేశారు.

 యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ కూడా మహేష్ బాబునే తనకు ఇష్టమైన నటుడిగా పేర్కొన్నారు. అలాగే విరాట్ కోహ్లీ జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాని, అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు పాటలకు సోషల్ మీడియాలో డాన్స్ చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.

Read more Photos on
click me!

Recommended Stories