పవన్‌ కళ్యాణ్‌ రాసిన పొలిటికల్‌ డైలాగ్‌లతో `హరిహర వీరమల్లు` టైలర్‌, హైలైట్స్ ముందే లీక్‌

Published : Jul 02, 2025, 03:54 PM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` మూవీ ట్రైలర్ రాబోతుంది. గురువారం దీన్ని రిలీజ్‌ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన క్రేజీ విషయం లీక్‌ అయ్యింది. 

PREV
15
క్రిష్‌ స్థానంలో జ్యోతికృష్ణ దర్శకుడిగా `హరిహర వీరమల్లు`

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `హరిహర వీరమల్లు`. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. మొదట క్రిష్‌ దర్శకత్వం వహించగా, ఆయన తప్పుకున్నారు. 

ఆ స్థానంలో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటరయ్యాడు. మధ్యలో ఆగిపోయిన మూవీని పట్టాలెక్కించాడు. తనదైన ట్రీట్‌మెంట్ ఇస్తూ సినిమాని కంప్లీట్‌ చేశాడు. ఇక ఈ మూవీ విడుదలకు రెడీ అవుతుంది.

 మరో మూడు వారాల్లో ఆడియోన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది టీమ్‌.

25
`హరిహర వీరమల్లు` ట్రైలర్‌ థియేటర్లలో ప్రదర్శన

`హరిహర వీరమల్లు` సినిమా నుంచి గ్లింప్స్, నాలుగు పాటలు విడుదలయ్యాయి. ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్‌ రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల కావాల్సి ఉండే, కానీ సినిమా వాయిదా పడటంతో ట్రైలర్‌ని కూడా వాయిదా వేశారు. 

ఇక ఫైనల్‌గా జులై 24న సినిమా రిలీజ్‌ కాబోతుంది. దీంతో ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లలోనే ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. అందుకోసం థియేటర్లని కూడా ఎంపిక చేశారు.

35
పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌ డైలాగ్‌లతో `హరిహర వీరమల్లు` ట్రైలర్‌

ఇప్పుడు `హరిహర వీరమల్లు` మూవీ ట్రైలర్‌కి సంబంధించిన క్రేజీ విషయం బయటకు వచ్చింది. ఇందులో పొలిటికల్‌ డైలాగ్‌లు ఉండబోతున్నాయట. ఇప్పటి రాజకీయాలకు దగ్గరగా ఉండే మూడు డైలాగ్‌లు ఉంటాయట. 

అయితే వాటిని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ రాయడం విశేషం. పండ్‌ డైలాగ్‌లు, వాటి రైమింగ్‌ అదిరిపోయేలా ఉంటాయని, ఎలివేషన్లు అంతకు మించి ఉంటాయని తెలుస్తోంది. 

ట్రైలర్‌ మొత్తంలో సుమారు 140 షాట్స్ ని చూపిస్తారని, ఒక్కోటి ఒక్కోలా ఉంటాయని, తెలుస్తుంది. ట్రైలర్‌ మూడు నిమిషాలు ఉండబోతుందట. థియేటర్లో చూస్తే ఇదొక అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ ని అందించబోతున్నట్టు తెలుస్తోంది.

45
అర్జున్‌ దాస్‌ వాయిస్‌ ఓవర్‌తో `హరిహర వీరమల్లు`

ఇవన్నీ ఓ ఎత్తైతే వాయిస్‌ ఓవర్‌ మరో ఎత్తుగా ఉండబోతుందట. దీనికి అర్జున్‌ దాస్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. అర్జున్‌దాస్‌ పవన్‌తో `ఓజీ` మూవీలో నటించారు. అందులో ఆయన నటన, వాయిస్‌లో బేస్‌ గురించి పవన్‌కి తెలుసు. 

దీంతో ట్రైలర్‌లో అర్జున్‌ దాస్‌ వాయిస్‌ ఓవర్‌ పెట్టారని తెలుస్తోంది. అయితే ఆయన వాయిస్‌ ట్రైలర్‌ కి హైలైట్‌గా నిలుస్తుందని, సీన్లని, ఎలివేషన్లని హైలైట్‌ చేసేలా ఆయన వాయిస్‌ ఉంటుందని సమాచారం. 

ఇలా విడుదలకు ముందే `హరిహర వీరమల్లు` ట్రైలర్ పై హైప్‌ క్రియేట్‌ అవుతుంది. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఈ ట్రైలర్‌ని రిలీజ్‌ చేయబోతుంది టీమ్‌. ఫస్ట్ థియేటర్లలో రిలీజ్‌ చేస్తారు, ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌ లోడ్ చేయబోతున్నారు.

55
`హరిహర వీరమల్లు` తో పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్ టైమ్‌ అలా

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` చిత్రంలో బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో ఔరంగ జేబ్‌కి వ్యతిరేకంగా పోరాడిన బందిపోటు వీరమల్లు చరిత్రని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

 ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీ నిర్మించారు. 

జులై 24న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల చేస్తున్నారు. పవన్‌ నుంచి వస్తోన్న మొదటి ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories