3 సినిమాలతో 3000 కోట్లు రాబట్టిన టాలీవుడ్ హీరోయిన్ కు బాలీవుడ్ లో బ్రేక్

ఇండియన్  బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న ఓ స్టార్ హీరోయిన్ స్పీడ్ కు బ్రేక్ లు పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.3300 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ తారకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? 

Rashmika Mandanna speed

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన హీరోయని్.. ఇటు సౌత్ లో అటు బాలీవుడ్ లో రచ్చ రచ్చ చేసింది. టచ్ చేస్తే చాలు వందల కోట్ల కలెక్షన్స్ తో, లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. మూడు సినిమాలతో దాదాపు 3000 కోట్ల హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసిన ఆ హీరోయిన్ కు ప్రస్తుతం ఎదురు దెబ్బ తప్పలేదు. ఇంతకీ ఆమె ఎవరో  కాదు రష్మిక మందన్న.

Also Read: పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?

Rashmika Mandanna speed

తాజాగా సికందర్ సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది రష్మికకు. వరుసగా విజయాలతో మంచి స్పీడ్ మీద ఉన్న రష్మికకు సికందర్ ప్లాప్ తో బ్రేకులు పడ్డట్టు అయ్యింది. సల్మాన్ ఖాన్ జంటగా రష్మిక నటించిన సికందర్ సినిమా  రంజాన్ సందర్భాగా  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన సికందర్  నిరాశపరిచింది.  కలెక్షన్లు కూడా దారుణంగా పడిపోయాయి. ఈమూవీ రిలీజ్ అయ్యి  7 రోజులు అవుతుండగా 94 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్ రన్ లో 150 కోట్లు రావచ్చనే అంచనాలు ఉన్నా.. అది సాధ్యం అవుతుందో లేదో తెలియదు. 

Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?


Rashmika Mandanna speed

సికందర్ సినిమాతో రష్మిక స్పీడ్ కు బ్రేక్స్ పడ్డట్టు అయ్యింది. కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందన్న హెచ్చరిక ఇచ్చినట్టు అయ్యింది.  గత మూడేళ్లగా దూసుకుపోతోంది రష్మిక. హిందీలో ఎక్కువ వసూళ్లు సాధించడం, అది కూడా  28 ఏళ్లకే రాష్మిక ఈ ఫీట్ ను చేయడంతో.. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ తార. ఆమె నటించిన యానిమల్, పుష్ప ది రూల్, ఛావా సినిమాలు హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో పాటు వసూళ్లలోనూ దుమ్మురేపాయి.

Also Read:3 నెలల్లో 60 ఫ్లాప్ సినిమాలు, 4 హిట్లు మాత్రమే, కోలీవుడ్ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది ?

Rashmika Mandanna speed

ప్రపంచవ్యాప్తంగా రాష్మిక నటించిన సినిమాలు రూ.3300 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇటీవల విడుదలైన 'ఛావా' సినిమా 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా 'ఛావా నిలిచింది.
 

Also Read:కార్తీక దీపం వంటలక్క రోజుకు ఎన్ని లక్షలు తీసుకుంటుందంటే? రెమ్యునరేషన్ భారీగా పెంచిన ప్రేమి విశ్వనాథ్

Rashmika Mandanna speed

దీంతో పాటు 2023లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ సరసన రాష్మిక నటించిన 'యానిమల్' సినిమా రూ.900 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. మరో 100కోట్లు వసూలు చేసి ఉంటే.. ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి ఉండేది. ఇక రష్మిక శ్రీవల్లిగా అలరించిన  పుష్ప2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనంగా మారింది. 

Rashmika Mandanna speed

అల్లు అర్జున్ జోడీగా రష్మిక  నటించిన పుష్ప2 సినిమా గత ఏడాది హిందీలో మాత్రమే రూ.812 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత విక్కీ కౌశల్ జోడీగా నటించిన చారిత్రక చిత్రం ఛావా హిందీలో మాత్రమే 503 కోట్లు, మరో సినిమా యానిమల్ రూ.532 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  రూ.1850 కోట్లకు పైగా వసూలు చేసిన నటిగా రష్మిక  నిలిచింది. 

Rashmika Mandanna speed

హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లు గా  ఉన్న దీపికా పదుకొణె, ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లు కూడా సాధించలేని రికార్డ్ ను  రాష్మిక మందన్న 3 సినిమాలతో క్రియేట్ చేసింది. 

ఇంతకు ముందు బాలీవుడ్‌ను ఏలుతున్న ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఆలియా భట్ ల వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టి రాష్మిక బాలీవుడ్ బాక్సాఫీస్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా మారిపోయింది.

Latest Videos

click me!