శారీలో చూపు తిప్పుకోనివ్వని నేషనల్‌ క్రష్‌.. `గర్ల్ ఫ్రెండ్‌` మైండ్‌ బ్లోయింగ్ లుక్స్

Published : Nov 02, 2025, 10:19 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా త్వరలో `ది గర్ల్ ఫ్రెండ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈక్రమంలో ఆమె నయా లుక్‌లో అదరగొట్టింది. నేషనల్‌ ఆటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. 

PREV
15
శారీలో కట్టిపడేస్తున్న రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా తాజాగా సోషల్‌ మీడియా అటెన్షన్‌ తన వైపు తిప్పుకుంది. ఆమె శారీలో కొత్త ఫోటోలను పంచుకుంది. బాడీకి హత్తుకునే శారీలో ఆమె గ్లామర్‌ మరింతగా పెరిగింది. ప్రస్తుతం రష్మిక పిక్స్ నేషనల్‌ వైడ్‌గా ఆడియెన్స్ అటెన్షన్‌ తనవైపు తిప్పుకోవడం విశేషం. 

25
ది గర్ల్ ఫ్రెండ్‌తో రాబోతున్న రష్మిక మందన్నా

రష్మిక మందన్నా ప్రస్తుతం `ది గర్ల్ ఫ్రెండ్‌` అనే చిత్రంలో నటించింది. ఈ మూవీకి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు.  ఇందులో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. లవ్‌ స్టోరీ నేపథ్యంలో సాగే మూవీ ఇది. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా దీన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. 

35
లేడీ ఓరియెంటెడ్‌ మూవీతో రష్మిక

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఓ వైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం రాబోతున్న `ది గర్ల్ ఫ్రెండ్‌` కూడా అలాంటి మూవీనే అని చెప్పొచ్చు.  రష్మిక పాత్ర ప్రధానంగానే ఈ  సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇది ఈ నెల 7న విడుదల కాబోతుంది. 

45
ఒకే ఏడాది ఐదు సినిమాలు

రష్మిక మందన్నా ఈ ఏడాది నాలుగు సినిమాల్లో నటించింది. `సికిందర్‌` మూవీ ఆడలేదు. కానీ `ఛావా`తో సంచలన విజయాన్ని అందుకుంది. ఇది ఎనిమిది వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత `కుబేర` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది రష్మిక. ఈ చిత్రం బాగానే ఉంది. ఇటీవల `థామా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రం డిజాస్టర్‌ గా నిలిచింది.  ఇప్పుడు ఐదో మూవీతో రాబోతున్న రష్మిక 

55
క్రేజీ మూవీస్‌లో రష్మిక మందన్నా

రష్మిక మందన్నా ప్రస్తుతం `కాక్ టైల్‌ 2` అనే హిందీ మూవీలో నటిస్తోంది. దీంతోపాటు తెలుగులో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `మైసా`లో నటిస్తోంది. ఇది యాక్షన్ ప్రధానంగా రూపొందే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ కావడం విశేషం. దీంతోపాటు  విజయ్‌ దేవరకొండతో రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల విజయ్‌ దేవరకొండతో రష్మిక ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories