అల్లు శిరీష్, నయనిక ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు శిరీష్ స్వయంగా తన ప్రేమ కథని బయట పెట్టారు.
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నారు. అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ తన ప్రేయసి నయనికతో గ్రాండ్ గా అక్టోబర్ 31న జరిగింది. అల్లు, మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీకి చెందిన మరికొందరు ప్రముఖులు, హీరోలు ఈ వేడుకకి హాజరయ్యారు. అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
25
తన లవ్ స్టోరీ రివీల్ చేసిన అల్లు శిరీష్
అయితే అల్లు శిరీష్ గురించి అందరికీ తెలుసు. కానీ నయనిక గురించి అంతగా జనాలకు తెలియదు. ఆమె ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. కానీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలయింది అనే ఆసక్తికర ప్రశ్న అభిమానుల్లో ఉంది. సస్పెన్స్ కి తెరదించుతూ అల్లు శిరీష్ నయనికతో తన ప్రేమ ఎలా మొదలైందో రివీల్ చేశాడు.
35
ఆ ఇద్దరు హీరోలే కారణం
నాయనిక చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి కాదు కానీ.. చిత్ర పరిశ్రమలో ఆమెకి స్నేహితులు ఉన్నారు. ఇద్దరు క్రేజీ హీరోల వల్ల తన లవ్ స్టోరీ ప్రారంభమైనట్లు శిరీష్ తెలిపారు. ఆ హీరోలు ఎవరో కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యంగ్ హీరో నితిన్. రెండేళ్ల క్రితం వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత అల్లు శిరీష్, నయనిక లవ్ స్టోరీ మొదలైందట. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి చేసుకున్న తర్వాత నితిన్, షాలిని దంపతులు వారికి పార్టీ ఇచ్చారు. వరుణ్ తేజ్, నితిన్ మంచి స్నేహితులు.
ఈ పార్టీకి వారి సన్నిహితులంతా హాజరయ్యారు. నితిన్ సతీమణి షాలిని కందుకూరికి నయనిక స్నేహితురాలు. దీనితో పార్టీకి ఆమెని కూడా ఇన్వైట్ చేశారు. ఆ పార్టీకి అల్లు శిరీష్ కూడా హాజరయ్యాడు. ఆ విధంగా అల్లు శిరీష్, నయనిక మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పార్టీ రోజు రాత్రే అంతా మొదలైంది అని శిరీష్ తెలిపారు.
55
నా పిల్లలకు ఇదే చెబుతా
రెండేళ్ల తర్వాత ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాం అని శిరీష్ పేర్కొన్నాడు. మాకు పిల్లలు పుట్టాక.. మీ లవ్ స్టోరీ ఏంటి అని అడిగితే నేను ఇలా మొదలైంది అని చెబుతాను అంటూ శిరీష్ పోస్ట్ చేశారు. సో అల్లు శిరీష్ తన లవ్ స్టోరీ గురించి ఎలాంటి రూమర్స్ కి తావు లేకుండా తానే చెప్పేశాడు.