గాయంపై స్పందించిన రష్మిక మందన్న..
కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు రష్మిక మందన్న ఫుల్‌స్టాప్ పెట్టింది. తన కొత్త సినిమా 'మైసా' షూటింగ్‌లో గాయపడినట్లు ఆమె ధృవీకరించింది. కొద్దిరోజుల విరామం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోకి తిరిగి వచ్చిన రష్మిక, తాను కోలుకుంటున్నానని, అభిమానులు ఆందోళన చెందవద్దని చెప్పింది.
ఇంట్లో రికవరీ అవుతున్న ఫొటోలను ఆమె షేర్ చేసింది. నవ్వుతూ సెల్ఫీలు, పజిల్స్ ఆడుతున్న క్షణాలు, తన పెంపుడు కుక్కలతో గడిపిన సమయం, స్నేహితులు పంపిన గిఫ్ట్‌లు, తిన్న డెజర్ట్‌ల ఫొటోలను పోస్ట్ చేసింది. తక్కువ సమయంలో ఇది మూడో గాయమని, ఇకపై తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు రష్మిక చెప్పుకొచ్చింది.