`ఏజ్ గురించే నేను అలా మాట్లాడాను, కానీ వేరే ఉద్దేశం లేదు, మోడలింగ్ వంటి పిచ్చి బ్రమలు అసలే లేవు, ఆయన మహేష్ బాబు ఆయనతో పోల్చితే నేనెవడిని, ఆయన చాలా అందగాడు, ఆయనతో నాకేం పోలిక, ఆయన సినిమా హీరో, నేను పొలిటీషియన్‌ని, ఆయన గ్లామర్ కాపాడుకొని, కష్టపడి ఆస్థాయికి వచ్చాడు. ఆయనకు నాకు పోలికలేదు, పోల్చుకోను` అని కేటీఆర్ తెలిపారు. మొత్తంగా మహేష్ బాబుకి, తనకు పోలిక లేదని, తనకు మోడలింగ్ లాంటి ఇంట్రెస్ట్ లు లేవని చెప్పాడు కేటీఆర్. కేసీఆర్ తనయుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్.. తెలంగాణ వచ్చాక ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశాడు. ఐటీ మంత్రిగా పాపులర్ అయ్యాడు.