`పుష్ప 2` సినిమాతో సంచలనాలు సృష్టించిన నేషనల్ క్రష్, రష్మిక మందన్నా గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్‌లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది.
ఇందులో రష్మిక చెబుతూ, `సరే, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకుంటున్నా. నేను నా జిమ్‌లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితితో ఉన్నాను. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడుకే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే నేను `థామ`, `సికిందర్`, `కుబేర` చిత్రాల సెట్‌లోకి అడుగుపెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ.
నా కాళ్లు యాక్షన్‌లోకి దిగడానికి ఓకే అని నిర్థారించుకున్న వెంటనే సినిమా సెట్‌లోకి అడుగుపెడతాను. ఈ లోగా మీకు నేను అవసరమైతే చాలా అధునాతనమైన బన్నీ హోప్ వ్యాయామం చేయడానికి కూడా రెడీగానే ఉంటాను` అని తెలిపింది రష్మిక మందన్నా. దర్శకుల గురించి ఆలోచించి ఆమె ఈ పోస్ట్ పెట్టడం విశేషం.