నిహారికా బెడ్‌ సీన్‌ చేసినా ప్రయోజనం లేదా?, మెగాడాటర్‌ తమిళ సినిమా కలెక్షన్లు చూస్తే షాక్‌

First Published | Jan 11, 2025, 9:07 PM IST

మెగా డాటర్ నిహారిక తమిళంలో `మద్రాస్‌కారణ్‌` అనే సినిమాలో నటించింది. తాజాగా ఈ మూవీ కలెక్షన్లు షాకిస్తున్నాయి. మెగా డాటర్‌ బెడ్‌ సీన్‌ చేసినా ప్రయోజనం లేదా?
 

Niharika Konidela

మెగా డాటర్‌ నిహారిక నటిగా సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె గతంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. కానీ సక్సెస్‌ కాలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. కానీ మ్యారేజ్‌ లైఫ్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. తక్కువ కాలంలోనే విడాకులు తీసుకున్నారు. 
 

అనంతరం ఆమె సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ మధ్య సినిమాలు నిర్మించి సక్సెస్‌ అయ్యింది. `కమిటీ కుర్రోళ్లు` మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. వెబ్‌ సిరీస్‌లు ఆకట్టుకున్నాయి. ఇక నటిగా తన అదృష్టం మరోసారి పరీక్షించుకుంటుంది. ఆమె తమిళంలో సినిమాలు చేస్తుంది. తాజాగా కోలీవుడ్‌ లో `మద్రాస్‌ కారణ్‌` మూవీ చేసింది. ఈ సినిమా శుక్రవారం(జనవరి 10) విడుదలైంది. 
 


అన్న రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌`కి పోటీగా అక్కడ విడుదలైంది. కానీ ఈ మూవీకి దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఫస్ట్ ఈ మూవీకి కేవలం రూ.25లక్షలు మాత్రమే వసూలు చేసినట్టు కోలీవుడ్‌ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు రెండో రోజు కూడా మరింత దారుణంగా ఉన్నాయి.

బుకింగ్స్ ని బట్టి తెలుస్తున్న సమాచారం మేరకు రెండో రోజు కేవలం రూ.12 లక్షల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మెగా డాటర్‌ సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం. 
 

`మద్రాస్‌కారణ్‌` మూవీకి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. షానే నిగమ్‌, కలైయరాసన్‌, నిహారిక, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. విలేట్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఊర్లో గొడవలు, ప్రతీకారాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో రూపొందించారు. రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కించారు. కానీ బాక్సాఫీసు వద్ద ఇది ఆదరణ పొందలేకపోతుంది. 
 

అయితే ఇందులో నిహారిక బెడ్‌ సీన్లు కూడా చేసింది. `సఖీ` సినిమాలోని `కాదల్‌సుడుగుడు` అనే పాటని ఇందులో రీమిక్స్ చేశారు. షానే నిగమ్‌తో జోడీగా ఈ రొమాంటిక్‌ సాంగ్‌ చేసింది నిహారికా. ఇందులో చాలా బోల్డ్ గా రొమాంటిక్‌గా కనిపించింది. శృతి మించి చేసింది. అయినా అది సినిమాకి హెల్ప్ కాలేకపోయింది.

ఆ మ్యాజిక్‌ని తీసుకురాలేకపోయిందని తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో నటిగా మెగా డాటర్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. ఇటు అన్న చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` కూడా నెగటివ్‌ టాక్‌తో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. 

read more: డాక్టర్‌ కాదు, పిల్లల్ని కనడం కాదు, సౌందర్యకి సినిమాల్లో తీరని కోరిక ఏంటో తెలుసా?

also read: ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌ 10 ఇండియన్‌ సినిమాలు, మన తెలుగు మూవీస్‌ ఎన్ని అంటే?
 

Latest Videos

click me!