సంక్రాంతి సినిమాలకు పెద్ద దెబ్బ, హైకోర్ట్ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

First Published | Jan 11, 2025, 10:40 PM IST

హైకోర్ట్ ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఇప్పుడు సంక్రాంతి సినిమాలకు పెద్ద దెబ్బపడబోతుంది. `డాకు మహారాజ్‌`, `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రాలపై ఈ ప్రభావం ఉండబోతుంది.
 

సంక్రాంతి పండగకి ఎక్కువగా సినిమాలు విడుదలవుతుంటాయి. ఎక్కువ మంది జనం సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. దీంతో ఆయన మూడు నాలుగు సినిమాలైనా ఆడే స్కోప్‌ ఉంది. బాగున్న సినిమాలకు పండగే పండగ. ఈ నేపథ్యంలో ఈ సారిమూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి.

రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` ఆల్‌రెడీ విడుదలయ్యింది. బాలకృష్ణ `డాకు మహారాజ్‌` విడుదల కాబోతుంది. వెంకటేష్‌ `సంక్రాంతికి వస్తున్నాం` కూడా రిలీజ్‌ కానుంది. 
 

Game Changer, Ramcharan, High Court

అయితే సంక్రాంతి సినిమాలకు ఆడియెన్స్ నుంచి డిమాండ్‌ ఉంటున్న నేపథ్యంలో టికెట్‌ రేట్లు పెంచుకుంటే అది నిర్మాతలకు ఉపయోగపడుతుంది. కలెక్షన్లు పెరుగుతాయి. ఎక్కువ షోలు వేస్తే కూడా హెల్ప్ అవుతుంది. అందుకే బెనిఫిట్‌ షోలో, టికెట్‌ రేట్లు పెంచుకుంటారు. అలానే ఈ సంక్రాంతికి కూడా టికెట్ రేట్లు పెంచారు.

ఆరు షోలకు కూడా అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కానీ అనూహ్యంగా హైకోర్ట్ రూపంలో పెద్ద దెబ్బ పడింది. జనం ఆరోగ్యం, భద్రత దృష్ట్యా హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెంచిన టికెట్‌ రేట్లని, అదనపు షోలకు సంబంధించి ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంది. 


ఇకపై తెలంగాణలో తెల్లవారు జామున స్పెషల్‌ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. టికెట్‌ రేట్ల పెంపు కూడా ఉండదని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో `గేమ్‌ ఛేంజర్‌` కి ఇచ్చిన పెంపు ఉత్తర్వులను కూడా ఉపసంహరించుకుంది ప్రభుత్వం.

ఈ నిర్ణయంతో ఏపీలోనూ టికెట్‌ రేట్లు, అదనపు షోలను తగ్గిస్తున్నారని తెలుస్తుంది. ఇదే జరిగితే ఈ సంక్రాంతి సినిమాలకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎంతో ఆశతో ఉన్న నిర్మాతలకిది పెద్ద షాకిచ్చే వార్తనే. 
 

అయితే హైకోర్ట్ ఆదేశాలు, ప్రభుత్వాల నిర్ణయం సాధారణ ఆడియెన్స్ కి హెల్ప్ చేస్తుంది. సినిమాలు చూసేందుకు అవకాశం పెరుగుతుంది. మామూలు ఆడియెన్స్ కూడా సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. పెరిగిన టికెట్‌ రేట్ల వల్ల థియేటర్‌కి రావడానికి ఆలోచిస్తారు. కానీ తాజా నిర్ణయంతో వాళ్లలో ఆశలు కలుగుతాయి.

రెండు మూడు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అది అంతిమంగా సినిమాలకే హెల్ప్ కాబోతుంది. ఎక్కువ మంది సినిమాలు చూసే అవకాశం ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ఓపెనింగ్స్ ద్వారా భారీ కలెక్షన్లు రాబట్టుకోవాలనుకున్న సినిమాలకు మాత్రం గట్టి దెబ్బ అనే చెప్పాలి. 

ఈ లెక్కన రేపు విడుదల కాబోతున్న బాలయ్య `డాకు మహారాజ్‌`కి ఎలాంటి ఎక్కువ రేట్లు, స్పెషల్‌ షోలో ఉండవు. నిర్మాతలు కూడా కోరలేదనే విషయం తెలిసిందే. అలాగే జనవరి 14న విడుదల కావాల్సిన వెంకటేష్‌ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకి కూడా మార్నింగ్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండబోదు.

ఇదిలా ఉంటే గత నెలలో అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని చెప్పిన విషయం తెలిసిందే. కానీ తమ మాటనే కాదని `గేమ్‌ ఛేంజర్‌` సినిమాకి టికెట్‌ రేట్లు పెంచారు. స్పెషల్‌ షోలకు అనుమతి ఇచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో కొందరు హైకోర్ట్ ని ఆశ్రయించగా తాజాగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 

read more: డాక్టర్‌ కాదు, పిల్లల్ని కనడం కాదు, సౌందర్యకి సినిమాల్లో తీరని కోరిక ఏంటో తెలుసా?

also read: ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌ 10 ఇండియన్‌ సినిమాలు, మన తెలుగు మూవీస్‌ ఎన్ని అంటే?

Latest Videos

click me!