ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలో టాప్ 10 పాపులర్ హీరోలు, హీరోయిన్ల జాబితాని విడుదల చేస్తుంది. ఇందులో ఇండియా వైడ్‌గా ఆ నెలలో ఏ స్టార్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. వారి సినిమాల అప్ డేట్లు, వారి సోషల్ మీడియా పోస్ట్ లు, ఫాలోవర్స్, పబ్లిక్‌లో కనిపించడం,
క్రేజ్, మార్కెట్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇండియా టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాని విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఇండియా టాప్ 10 పాపులర్ హీరోయిన్ల జాబితాని విడుదల చేసింది ఓర్మాక్స్ మీడియా.