ఈ విషయాన్ని నరేష్ చెబుతూ, ఆమె ఎవరో తెలియదు కానీ, హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను, నన్ను చూసి.. ఆమెపై(పవిత్ర) మీరు చూపించే శ్రద్ధ, ప్రేమ బాగుంది. ఆమెని అమ్ము అని పిలిచే విధానం నన్ను కట్టిపడేసింది. మీరు జెంటిల్‌మెన్, ఆమె మిమ్మల్ని పొందడం ఆమె అదృష్టం, అలాగే మీరు ఆమెని పొందడం నిజంగా మీ అదృష్టం.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు` అని చెప్పి స్వీట్ బాక్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయిందట ఆ మహిళ. ఆ సమయంలో ఆమె ముఖంలోని నిజాయితీ నచ్చిందని, ఆమె ఎవరో తెలియదు కానీ, ఆమెని జీవితాంతం గుర్తుంచుకుంటాం అని, మా జీవితంలో ఇదొక మెమొరబుల్ మూమెంట్ అని తెలిపారు నరేష్.