Pan India Star Heroine: 21 ఏళ్లకే నిశ్చితార్థం, వెంటనే వచ్చిన బ్రేకప్… వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుగులు కంటే.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వరుస బ్లాక్‌బస్టర్లతో నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎవరి జీవితంలోనైనా అవకాశాలు దరికి రావు.. వాటి కోసం మనమే వెంబడించాలి. ఒక్కసారి ఓటమి ఎదురైందని వెనక్కి తగ్గిపోతే విజయాలు అందవు. ఇదే విషయాన్ని తన జీవితంతో నిరూపించింది ఓ హీరోయిన్. 21 ఏళ్లకే నిశ్చితార్థం, వెంటనే వచ్చిన బ్రేకప్… వ్యక్తిగత జీవితంలోని ఆ తుఫానును టర్నింగ్ పాయింట్‌గా మార్చుకుని, ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వరుస బ్లాక్‌బస్టర్లతో టాప్ స్థాయికి చేరుకుంది. నేడు పాన్ ఇండియా హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
25
నేషనల్ క్రష్
ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ కన్నడ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను ఇట్టే ఆకట్టుకున్న బ్యూటీ రష్మిక మందన్నా నేడు పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నారు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన ఆమె, రణ్‌బీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ తో కొత్త రికార్డులు సృష్టించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రష్మిక క్రేజ్‌ను మరింత పెంచింది.
35
బాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్
ఆ తరువాత ఈ బ్యూటీ పుష్ప-2: ది రూల్ లో అల్లుఅర్జున్ సరసన నటించి ఓల్ ఇండియన్ షేక్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. అలాగే హిందీలోనూ వరుసగా ఆఫర్లతో బిజీగా ఉంటూ టాప్ పోజిషన్‌లో కొనసాగుతున్నారు. గతేడాది ఛావా సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రష్మిక, ఇప్పుడు హారర్ కామెడీ ఎంటర్టైనర్ తమాలో నటిస్తున్నారు. తాజాగా మరో పెద్ద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇలా పాన్ ఇండియ లెవల్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.
టాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న, ఒకప్పుడు వ్యక్తిగత జీవితంతోనే పెద్ద చర్చకు దారితీసింది. కెరీర్ ప్రారంభ దశలోనే నిశ్చితార్థం చేసుకున్న రష్మిక, సడెన్‌గా ఆ సంబంధాన్ని విరమించుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ మూవీ సమయంలో రష్మిక, హీరో రక్షిత్ శెట్టి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దల సమ్మతి తీసుకొని 2017లో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో రష్మిక వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే.
55
వరుస ఆఫర్లతో స్పెషల్ స్టార్‌డమ్
బ్రేకప్ తరువాత రష్మిక కెరీర్ కొత్త ఊపందుకుంది. నాగశౌర్యతో చేసిన చలో సినిమా మంచి పేరు తెచ్చింది. దాంతో వరుసగా తెలుగు ఆఫర్లు వరుసగా రష్మికను పలికాయి. గీతా గోవిందంతో సెన్సేషన్ క్రియేట్ చేసి, డియర్ కామ్రేడ్, దేవదాస్ వంటి చిత్రాల్లో నటిస్తూ స్టార్‌డమ్ దిశగా దూసుకుపోయింది. బ్రేకప్ వల్ల వెనుకడుగు వేయకుండా రష్మిక మరింత ఫోకస్‌గా మారింది. ఈరోజు ఆమె పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ, నిజమైన పాన్ ఇండియా హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 21 ఏళ్లకే ఎంగేజ్‌మెంట్, ఆ తర్వాత సడెన్ బ్రేకప్… కానీ అదే రష్మిక మందన్న కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.