నరేష్ ను పవిత్ర లోకేష్ ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? ఆ పేరుకు అర్ధం ఏంటంటే?

Published : Sep 19, 2025, 06:22 PM IST

నరేష్, పవిత్ర లోకేష్ బంధం గురించి అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు తారలు ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఇక తాజాగా విరికి సబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. నరేష్ ను పవిత్ర లోకేష్ ముద్దుగా ఏమని పిలుస్తుందంటే? 

PREV
16
నటుడిగా దూసుకుపోతున్న నరేష్

అటు సినిమాల్లో, ఇటు వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతుంటారు టాలీవుడ్ నటుడు నరేష్. నటుడిగా స్టార్ డమ్ ఉన్నా, వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఆయకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. మరీ ముఖ్యంగా నరేష్ మూడు పెళ్లతో మరింత వైరల్ అయ్యారు. ప్రస్తుతం నాలుగో పెళ్లికి ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పవిత్ర లోకేష్ తో కలిసి జీవిస్తోన్న నరేష్.. ఆమెను పెళ్ళాడతాడని అంటున్నారు.

26
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నరేష్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నాడు. రకరకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ ‘బ్యూటీ’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో నరేష్ హీరోయిన్ తండ్రిగా కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

36
నరేష్ ముద్దుపేరు ఏంటి?

ఏ వ్యక్తికైనా కామన్ గా ముద్దు పేరు ఉంటుంది. నటుడు నరేష్ కు కూడా ఓ ముద్దు పేరు ఉందట. ఈ ఇంటర్వ్యలో ముఖ్యంగా, తనను పిలిచే ముద్దు పేర్ల గురించి నరేష్ వెల్లడించారు. ఆయన్ను తన తల్లి దివంగత హీరోయిన్ విజయనిర్మల ఏమనిపిలుస్తారు, పవిత్ర లోకేష్ ఏమని పిలుస్తారు అనే విషయాలను నరేష్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

46
విజయ నిర్మల ఏమని పిలిచేవారు?

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. “మా అమ్మ నన్ను నరి అని పిలిచేది…” మా అమ్మ నన్ను ‘నరి’ అని పిలిచేది. ‘నరి’ అంటే తమిళంలో నక్క. మా అమ్మ పిలుపు విని.. మా ఫ్రెండ్స్ నన్ను ‘ఫాక్స్’ అని ఏడిపించడానికి పిలిచేవాళ్లు. ప్రేమగా ‘నారి’ అని పిలిచేవాళ్లు. ముద్దుగా ‘నారిగా’ అంటారు. అలా పిలిచినప్పుడు ‘కాకా పట్టొచ్చు’ అని అర్థం చేసుకునే వాడిని." మరి ఎవరైనా ఇప్పుడు అలా పిలుస్తున్నారా అని యాంకర్ ప్రశ్నించగా నరేష్ డిఫరెంట్ గా స్పందించారు.

56
పవిత్ర లోకేష్ ఏమని పిలుస్తుంది ?

ఇక పవిత్ర లోకేష్ నరేష్ ను ఏమని పిలుస్తుంది అనే సందేహం ఆడియన్స్ లో ఉంది. ఇక ఈ విషయం గురించి నరేష్ స్వయంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తనను ఇప్పుడు తన తల్లి పిలిచినట్టుగా ప్రేమగా ఎవరు పిలవడంలేదు అని అన్నారు. “ఇప్పుడేం అలా ఎవ్వరూ పిలవరు. పవిత్ర లోకేష్ నన్ను చాలా గౌరవంగా పిలుస్తుంది. ముద్దు పేరు అయితే ‘రాయా’ అంటుంది. అది ముద్దు పేరు కాదు కానీ, షార్ట్‌గా పిలుస్తూ ఉంటుంది,” అని చెప్పారు. దాంతో ఈకామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెట్టింట్లో రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

66
పవిత్ర-నరేష్ బంధం

నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్‌తో గత కొంతకాలంగా కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట ఇప్పటివరకు తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించకపోయినా, పబ్లిక్ ఈవెంట్స్‌లో కలిసే కనిపించడం, ఫోటోలు షేర్ చేయడం ద్వారా తమ బంధాన్ని అందరికీ తెలియజేశారు. వారి సంబంధం గురించి మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. గతంలో వీరి వ్యవహారం వివాదాస్పందం కూడా అయ్యింది. అంతే కాదు వీరిద్దరు, వారి కథను ఆధారంగా చేసుకుని, మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories