రష్మిక మందన్న
Rashmika Mandanna: తండ్రి కంటే ఎక్కువ వయసున్న సల్మాన్ ఖాన్‌తో `సికందర్ మూవీలో హీరోయిన్‌గా నటించింది రష్మిక. నా ఊరు హైదరాబాద్ అని చెప్పడంతో కన్నడిగులు ఆమెపై మండిపడుతున్నారు.
Rashmika Mandanna
రష్మిక మందన్న రక్షిత్ శెట్టితో బ్రేకప్ అయ్యాక ఏదో ఒక గొడవతో ఫేమస్ అవ్వడం కామన్ అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో తన గురించి డిస్కస్ చేయడం చూసి బాధపడ్డానని చెప్పింది.
Rashmika Mandanna
నెటిజన్లు తన గురించి మాట్లాడకపోతే మూలన పడేస్తారేమో అని చిన్న భయం మొదలయ్యేదని కూడా చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్‌ను వెటకారంగా మాట్లాడింది.
Rashmika Mandanna
ఆమె సమాధానం రిషబ్ శెట్టితో సహా `కిరిక్ పార్టీ` టీమ్‌కు బాధ కలిగించింది. ఆ తర్వాత తన మాటలను వక్రీకరించారని బాధతో ఒక నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రష్మిక మందన్నా
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలోనూ రష్మికపై అసంతృప్తి మొదలైంది. తెలుగుకు చెందిన ఫేమస్ సినిమా రైటర్ తోట ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో రష్మికపై అసహనం వ్యక్తం చేశారు.
రష్మిక మందన్నా
రష్మిక ఒకసారి `కిరిక్ పార్టీ` సినిమా పేరు చెప్పకుండా ఆ మూవీని అవమానించేలా ప్రవర్తించింది. దీని గురించి మాట్లాడుతూ తోట ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు.
రష్మిక మందన్నా
రష్మిక మందన్నా కన్నడ మాత్రమే కాదు తెలుగు మొదటి సినిమా విషయంలోనూ ఇలాగే ప్రవర్తించింది. రక్షిత్ శెట్టి లాగే తన మొదటి తెలుగు సినిమా నటుడిని కూడా పట్టించుకోలేదు.
రష్మిక మందన్నా
అప్పుడే తోట ప్రసాద్ రష్మికని బ్యాన్ చేయడంలో అర్థం లేదని అన్నారు. అంతేకాదు, ఇదే పొగరు కొనసాగితే ఆమెకు చిత్ర పరిశ్రమలో భవిష్యత్తు ఉండదని కూడా చెప్పారు. నటిని బ్యాన్ చేయడం అనేది జరగని పని, అది న్యాయం కూడా కాదని తోట ప్రసాద్ అన్నారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రష్మిక తెలుగులో మొదటి సినిమా `ఛలో`. ఇందులో నాగశౌర్య హీరో. వెంకీ కుడుముల దర్శకుడు. ఈ మూవీ హిట్ కావడంతోనే తెలుగులో ఆఫర్లు వచ్చాయి.