అనంతరం చిరంజీవి మాట్లాడారు. ఆయన చెబుతూ, `చిన్నప్పుడు నాన్న చేతులకు భయపడ్డాను. ఆ తర్వాత మాస్టార్ బెత్తానికి భయపడ్డాను. ఎదిగే సమయంలో దేవుడికి, పెద్దలకు భయపడుతూ క్రమశిక్షణతో ఎదుగుతూ వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మా నాన్న భయపెట్టరు, దర్శక, నిర్మాతలు భయపెట్టడం లేదు.
కానీ ఇప్పుడు భయపెట్టేది మీ(అభిమానులు) ఈలలు, చప్పట్లు. సాధారణంగా ఈ ఈలలు, చప్పట్లకు ఎవరైనా ఆనందపడతారు, ఉత్సాహపడతారు, రెచ్చిపోతారు, బ్యాలెన్స్ తప్పుతారు. కానీ భయంగా ఉంది. ఇప్పుడు పొందుతున్న ఈ ఆనందం, మీ ఈలలు, చప్పట్లు, అరుపులు, కేరింతలు వచ్చే ఏడాది,
ఆ తర్వాత ఏడాది, ఆ తర్వాత, ఆ తర్వాత ఓపిక ఉన్నంత వరకు ఇంతకి పదింతలు అందించగలరా? అనే భయం ఎక్కువగా ఉంది` అని తెలిపారు చిరంజీవి. అభిమానుల్లో జోష్ నింపేలా ఆరోజు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.