Rashmika Mandanna: సిగ్గు పడ్డట్లు అస్సలు అనిపించలేదు, మరిది సినిమాపై రష్మిక క్రేజీ కామెంట్స్

Published : Sep 04, 2026, 10:55 PM IST

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రష్మిక మందన్న, తన మరిది ఆనంద్ దేవరకొండతో పాటు దర్శకుడు ఆదిత్యపై సరదా వ్యాఖ్యలు చేశారు.

PREV
13
రష్మిక మందన్న

రష్మిక మందన్న ముఖ్య అతిథిగా హాజరైన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందడిగా జరిగింది. ఈ సందర్భంగా తన బావ ఆనంద్ దేవరకొండపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రైలర్ తనకు చాలా బాగా నచ్చిందని, మంచి రొమాంటిక్ కామెడీ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగిందని చెప్పారు. తాను ఈ సినిమాను తప్పకుండా చూస్తానని తెలిపారు.

23
హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌

ఆనంద్ తనకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రావాలని మెసేజ్ చేశాడని రష్మిక వెల్లడించారు. ప్రస్తుతం ‘రణబలి’ షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్నానని, అందుకే వస్తానని ఆనంద్‌కు చెప్పినట్లు తెలిపారు. ఇక ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’లో వైష్ణవి చైతన్య పోషించిన హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని రష్మిక పేర్కొన్నారు. వైష్ణవి తన నటనతో అదరగొట్టి ఉంటుందని ప్రశంసించారు.

33
ఆదిత్య హాసన్‌పై రష్మిక సరదాగా కామెంట్స్

అదే సమయంలో దర్శకుడు ఆదిత్య హాసన్‌పై కూడా రష్మిక సరదాగా కామెంట్స్ చేశారు. ఆదిత్యను చూస్తే చాలా షైగా కనిపిస్తారని, కానీ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడా ఆ షైనెస్ కనిపించలేదని అన్నారు. ముఖ్యంగా ట్రైలర్‌లోని రొమాంటిక్ సీన్లను ప్రస్తావిస్తూ రష్మిక పరోక్షంగా సరదా సెటైర్లు వేశారు. తన మాటలతో ఈవెంట్‌లో నవ్వులు పూయించడంతో పాటు, ట్రైలర్‌లోని రొమాంటిక్ కంటెంట్‌పై ఆసక్తిని మరింత పెంచారు.

Read more Photos on
click me!

Recommended Stories