రష్మిక, విజయ్ డేటింగ్ చేస్తున్నారనేది పాత వార్త. పెళ్లి చేసుకుంటారని చాలా నెలలుగా చర్చ జరుగుతోంది. అయితే వీరు ఇంత వరకూ ఈ విషయంలో బయటపడలేదు. అలా అని ఖండించలేదు కూడా. ప్రేమించుకుంటున్నామని కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో సినీ నటితో డేటింగ్ చేస్తున్నానని విజయ్ ఒప్పుకున్నాడు. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో మీకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని రాష్మిక కూడా అన్నారు.