చాలా తక్కువ టైమ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం మాత్రమే కాదు, వేల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కు మహరాణిగా నిలిచింది ఓ హీరోయిన్. ఇండస్ట్రీలో ఏళ్లుగా ఉన్న నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు సాధించలేనిది ఆ హీరోయిన్ చాలా తక్కువ టైమ్ లోనే సాధించి చూపించింది.
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. వేల కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది. 20 ఏళ్లకు పగా ఇండస్ట్రీలో ఉన్న నయనతార, త్రిష లాంటి హీరోయిన్లకు కూడా సాధ్యం కానిది రష్మిక మందన్న వల్ల మాత్రమే సాధ్యం అయ్యింది.
నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కొత్త సినిమా 'కాక్‌టెయిల్ 2' సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది. కృతి సనన్, షాహిద్ కపూర్ కూడా నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా రష్మిక నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆమె ఉండబట్టే సినిమా ఆమాత్రం నడిచిందంటూ.. రష్మికపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
36
ఫుల్ డిమాండ్ ఉన్న తార
'నేషనల్ క్రష్' రష్మిక మందన్న తన నటనతో అభిమానుల మనసు దోచుకుంటూనే ఉంది. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, ఈరోజు భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న తారలలో ఒకరిగా నిలిచింది. అందం, బహుముఖ ప్రతిభ, పాన్-ఇండియా అప్పీల్‌తో ప్రతి సినిమాలోనూ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.
ఇటీవలి కాలంలో అతిపెద్ద బాక్సాఫీస్ హిట్‌లలో రష్మిక భాగం కావడం ఆమె విజయ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా నిలుపుతోంది. రిపోర్ట్స్ ప్రకారం, 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా రూ.1,742 కోట్లు వసూలు చేయగా, 'పుష్ప' మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు రాబట్టింది. ఇక 'యానిమల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లు, 'ఛావా' చిత్రం రూ.809.91 కోట్లు వసూలు చేసినట్లు బాక్సాఫీస్ రిపోర్టులు చెబుతున్నాయి.
56
కలెక్షన్ల లెక్క చూస్తే షాక్ అవుతారు!
ఈ సినిమాలన్నింటి మొత్తం కలెక్షన్‌ను లెక్కిస్తే, రష్మిక నటించిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.3800 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇది ఆమెను ఇండస్ట్రీలో అత్యంత బ్యాంకబుల్ నటీమణులలో ఒకరిగా నిలబెట్టింది. కెరీర్ లో ఇంత తక్కువ టైమ్ లో ఈ రేంజ్ లో కలెక్షన్లు ఏ హీరోయిన్ కు సాధ్యం కాలేదని చెప్పాలి. నయనతార, త్రిష, సమంత, ఇలా చాలామంది హీరోయిన్లు ఉన్నా.. రష్మిక సాధించిన స్టార్ డమ్ ను అందుకోలేకపోయారు.
66
ఇండస్ట్రీలో రష్మిక మందన్న ఎఫెక్ట్
రష్మికకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆమె పాన్-ఇండియా పాపులారిటీ. బ్లాక్‌బస్టర్ సినిమాలు, దేశవ్యాప్తంగా ఉన్న భారీ అభిమానగణం కారణంగా ఆమె నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఆధునిక భారతీయ సినిమా బాక్సాఫీస్ లెక్కలను మార్చగల సత్తా ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో రష్మిక ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.