Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?

Published : Jun 20, 2026, 06:42 PM IST

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. కొణిదెల వారి గారాల పట్టి క్లింకార ఫేస్ ను రామ్ చరణ్ ఉపాసన రివిల్ చేశారు. ఆమె ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరి క్లింకార ఫేస్ లో ఎవరి పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే?

PREV
15
క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకార ముఖాన్ని చూడాలన్న అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. తమ కుమార్తె మూడో పుట్టినరోజు సందర్భంగా ఈ స్టార్ మెగా కపుల్స్ తొలిసారిగా క్లీంకార పూర్తి ముఖం కనిపించే ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు తమ కుమార్తె ప్రైవసీని అత్యంత జాగ్రత్తగా కాపాడిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లీంకార ముఖం బయటకు కనిపించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

25
క్షణాల్లో వైరల్ అయిన క్లింకార ఫోటో..

ఈసారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక ఫొటోలో క్లీంకార పూర్తి ముఖం కనిపించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో క్లీంకార స్కై బ్లూ రంగు ఫ్రాక్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మరోవైపు రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తెను ప్రేమగా ఆడిస్తూ కనిపిస్తున్న ఈ ఫోటో చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. క్లీంకార ముఖం కనిపించేలా విడుదలైన తొలి అధికారిక ఫొటో కావడంతో ఈ పిక్ క్షణాల్లోనే వైరల్‌ అయ్యింది.

35
ఎవరి పోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?

ఫొటోను చూసిన మెగా అభిమానులు క్లీంకార అచ్చం తన తండ్రి రామ్ చరణ్ పోలికలతోనే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే క్లింకార ఫేస్ లో చరణ్, ఉపాసన ఇద్దరి పోలికలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముక్కు, నవ్వు ఉపాసన మాదిగా ఉంది. కళ్లు, నుదురు రామ్ చరణ మాదిరిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ పోటోను మెగా అభిమానులు క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు.

45
క్లీంకార పేరు ఎలా పెట్టారంటే?

‘క్లీంకార’ అనే పేరు లలిత సహస్రనామాల నుంచి నుండి తీసుకున్నారు ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఆమె జన్మించిన తర్వాత తమ ఇంట్లో ఆనందం, అదృష్టం మరింత పెరిగాయని ఆయన గతంలో అన్నారు. క్లింకార పుట్టిన ఏడాది మెగాస్టార్ కు పద్మ విభూషన్ వచ్చింది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చింది. ఇలా క్లింకార మెగా ఫ్యామిలీకి లక్కీగా మారింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు క్లింకారతో పాటు ఇద్దరు కవల పిల్లలు కూడా పుట్టారు. ఒకరు బాబు కాగా.. అతనికి శివరామ్ అని, పాపకు అనిర్వా దేవి అని పేర్లు పెట్టారు.

55
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే..?

ఇక రామ్ చరణ్ సినీ కెరీర్ విషయానికొస్తే, దర్శకుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో రూపొందిన పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటించారు. ఈస ఈసినిమా ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతూ ఇప్పటికే రూ.400 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సమాచారం. ఈ సినిమాతరువాత ఆయన సుకుమార్ డైరెక్షన్ లో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నారు. త్వరలో ఈమూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories