రష్మికకి ఆల్రెడీ అతడితో నిశ్చితార్థం, బ్రేకప్.. విజయ్ దేవరకొండతో ప్రేమ ఎలా మొదలైందంటే

Published : Oct 04, 2025, 02:21 AM IST

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూద్దాం. 

PREV
16
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న 

 టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన జంటల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రధానంగా ఉంటారు. తెరపై వారి కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో, తెరవెనుక కూడా వారిద్దరి మధ్య ఏదో ప్రత్యేక అనుబంధం ఉందనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలని నిజం చేస్తూ రష్మిక, విజయ్ దేవరకొండ జంట శుక్రవారం రోజు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ స్టోరీ ఎలా ప్రారంభమైంది ? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. 

26
గీత గోవిందంతో మొదలైన ప్రయాణం 

విజయ్ దేవరకొండ, రష్మీకల జర్నీ రీల్ లైఫ్ తో మొదలై రియల్ లైఫ్ కి చేరుకుంది. తొలిసారి వీరిద్దరూ గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో విజయ్, రష్మిక మధ్య క్యూట్ రొమాన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారి కలుసుకుంది ఈ చిత్రం కోసమే. 

36
అంతకు ముందే కన్నడ నటుడితో రష్మికకి నిశ్చితార్థం 

విజయ్ దేవరకొండతో పరిచయం కంటే ముందుగానే రష్మికకి కన్నడ నటుడు, తన కోస్టార్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. కానీ ఊహించని విధంగా ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీనితో రష్మిక.. రక్షిత్ తో తన ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తో పరిచయం ఏర్పడింది. 

46
డియర్ కామ్రేడ్ తర్వాత మొదలైన రూమర్స్

 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో రష్మిక–విజయ్ కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరూ బోల్డ్ గా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. దీనితో వారి నిజ జీవిత సంబంధంపై ఊహాగానాలను మరింత పెరిగాయి. తరచుగా వీరిద్దరూ సందర్భం వచ్చినప్పుడల్లా కలిసేవారు. దీనితో విజయ్, రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అనే ప్రచారం ఎక్కువైంది. 

56
పండుగలు కలిసి జరుపుకోవడం

2023లో న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక లైవ్ సెషన్‌లో పాల్గొంది. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్ వాయిస్ వినిపించిందని అభిమానులు గుర్తించారు. అదే ఏడాది దీపావళి సందర్భంగా రష్మిక–విజయ్ వేరువేరుగా పోస్ట్ చేసిన ఫొటోల్లో గోడ కలర్ ఒకేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీని ఆధారంగా రష్మిక విజయ్ ఇంట్లోనే ఉన్నారని ఊహించారు.

66
ఎట్టకేలకు నిశ్చితార్థం

విజయ్ దేవరకొండ, రష్మిక ఇక అభిమానులతో దాగుడు మూతలు ఆడడం ఆపేశారు. తమ రిలేషన్ ని అఫీషియల్ చేస్తూ అక్టోబర్ 3న శుక్రవారం రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. వీరిద్దరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతోంది. .

Read more Photos on
click me!

Recommended Stories