కొత్తల్లుడికి గ్రాండ్ వెల్కం, కొడవ సంప్రదాయ గెటప్ లో రష్మిక విజయ్ ఎలా ఉన్నారో చూశారా?

Published : Apr 07, 2026, 04:32 PM IST

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట కొడగులోని విరాజ్‌పేట్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట, ప్రస్తుతం మందన్న కుటుంబ సభ్యులు, బంధువుల కోసం కొడవ సంప్రదాయంలో ఈ వేడుకను నిర్వహించింది.

PREV
17
విరాజ్‌పేట్‌లో గ్రాండ్ రిసెప్షన్

సుమారు నెలన్నర క్రితం రాజస్థాన్‌లో చాలా ప్రైవేట్‌గా పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తాాజాగా  మందన్న కుటుంబ సభ్యులు, బంధువుల కోసం విరాజ్‌పేట్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో రష్మిక మందన్న కొడవ ట్రెడిషన్ శారీలో మెరిసిపోయింది. 

27
కొడవ సంప్రదాయ పద్ధతిలో..

విరాజ్‌పేటలోని అందమైన 'సెరినిటీ హాల్' లో ఈ స్టార్ కపుల్ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది.  కొడవ సంప్రదాయ పద్ధతులతో ఈ వేడుక జరిగింది. ఫంక్షన్ హాల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, ఆహ్వానితులకు మాత్రమే లోపలికి అనుమతించారు. 

37
ఉదయ్‌పూర్ పెళ్లి తర్వాత తొలిసారి..

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎలాంటి హడావుడి లేకుండా జరిగింది. ఆ పెళ్లికి వెళ్లలేని బంధువుల కోసం మందన్న కుటుంబం ఈ ప్రత్యేక రిసెప్షన్‌ను ఏర్పాటు చేసింది. పెళ్లయిన నెలన్నర తర్వాత ఈ కార్యక్రమం జరగడం అభిమానుల్లో  ఆసక్తిని రేపుతోంది.

47
కొత్తల్లుడికి గ్రాండ్ వెల్కమ్..

ఈ రిసెప్షన్‌కు హీరో విజయ్ దేవరకొండ కుటుంబం నుంచి కూడా కొంతమంది ముఖ్యమైన అతిథులు హాజరయ్యారు. విజయ్ తల్లిదండ్రులు, అత్యంత సన్నిహితులు కొడగు ఆతిథ్యాన్ని స్వీకరించారు.  ఈ సందర్భంగా అల్లుడి కుటుంబానికి కొడవ సంస్కృతి, ఆహారపు అలవాట్లను పరిచయం చేశారు. విజయ్ దేవరకొండకు గ్రాండ్ వెల్కం చెప్పి.. కొత్తల్లుడికి కావల్సిన మర్యాదలు చేశారు.  

57
సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం..

సెలబ్రిటీల కార్యక్రమం కావడంతో, కుటుంబ సభ్యులు ఈ వేడుకను చాలా ప్రైవేట్‌గా నిర్వహించారు. కేవలం సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం పంపారు. మీడియాకు కూడా అనుమతి లేదని సమాచారం. 'గీత గోవిందం'లో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటై తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 

67
పుట్టింటికి వచ్చిన కూతురికి కాస్ట్లీ గిఫ్ట్

పెళ్లి తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చిన కూతురు రష్మిక మందన్నకు ఆమె తండ్రి మదన్ మందన్న ఖరీదైన  కానుకను అందించాడు. ఏకంగా తమ ఇంటినే కూతురికి  బహుమతిగా ఇచ్చారు.

77
రష్మిక పేరు మీదకు ఇంటి రిజిస్ట్రేషన్
కొడగు జిల్లా, విరాజ్‌పేట తాలూకాలోని కుక్లూరు గ్రామ నివాసి, విరాజ్‌పేట టౌన్ పంచాయతీ మాజీ సభ్యుడు అయిన మదన్, ఆయన భార్య సుమన్ మందన్న పేరు మీద ఉన్న సర్వే నంబర్ 142/1, 142/2లోని 'సెరినిటీ' ఇంటిని కూతురు రష్మిక పేరు మీదకు మార్చారు.
Read more Photos on
click me!

Recommended Stories