ఈటీవీలో షో చేస్తూ, మరో ప్లాట్ ఫామ్‌లో షో చేయడంపై రియాక్ట్ అవుతూ, ఈటీవీలోగానీ, మల్లెమాల దాంట్లో గానీ ఒక షో చేస్తే, మరో షో చేయోద్దనే నిబంధన లేదని, కాకపోతే ఒకే తరహా షో రెండింటిలోనూ చేయడానికి లేదని, ఒకే టైమ్ లో వచ్చే షోలు అయితే అభ్యంతరం ఉంటుందిగానీ, రెండు వేర్వేరు షోలు, రెండు వేర్వేరు టైమ్ స్లాట్‌లో వచ్చే షోలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పుడు తాను చేసేది కూడా అదే అని చెప్పింది. జబర్దస్త్ షోకి, ప్రస్తుతం తాను `ఆహా`లో చేయబోతున్నా టాప్ తెలుగు ఇన్ ఫ్లూయెన్సర్స్ షోకి సంబంధం లేదని, రెండు వేర్వేరు అని, ఒకదాని వల్ల మరోదానికి ఎలాంటి సమస్య లేదని చెప్పింది రష్మి. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.