Ranya Rao: హవాలా డబ్బుతో బంగారం.. రన్యా రావ్ ఏం చెప్పారంటే?

Ranya Rao Gold Smuggling Case : దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి రన్యా రావ్, బంగారం కొనడానికి హవాలా ద్వారా డబ్బు పంపిణీ చేసినట్లు అంగీకరించినట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది.

Ranya Rao Admits Using Hawala Money for Gold Purchase in telugu rma

Ranya Rao Gold Smuggling Case : దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ నటి రన్యా రావ్, తాను బంగారం కొనడానికి హవాలా ద్వారా డబ్బు పంపినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కోర్టుకు తెలిపింది. ఈ కేసులో నటి రన్యా రావ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తు విచారణ పూర్తయిన తర్వాత, నగరంలోని 64వ అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు మార్చి 27న తీర్పు ఇస్తామని తెలిపింది.

Ranya Rao Admits Using Hawala Money for Gold Purchase in telugu rma
Ranya Rao Admits Using Hawala Money for Gold Purchase

దీనికి ముందు జరిగిన విచారణలో, రన్యా రావ్ చట్టవిరుద్ధంగా బంగారం అక్రమ రవాణా చేయడం బెయిల్ ఇవ్వలేని తీవ్రమైన నేరమని DRI తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో బంగారం అక్రమ రవాణా నేరం మాత్రమే జరగలేదనీ, ఇతన నేరాలను ప్రస్తావించారు. 


Ranya Rao Admits Using Hawala Money for Gold Purchase

విచారణలో రన్యానే స్వయంగా బంగారం కొనడానికి కావలసిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు పంపినట్లు ఒప్పుకుందని చెప్పారు. రన్యా రావ్ దుబాయ్ నుండి బంగారంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 6:30 గంటలకు వచ్చినప్పుడు, DRI అధికారులు ఆమెను తనిఖీ చేయగా బంగారం బయటపడింది.

Ranya Rao Admits Using Hawala Money for Gold Purchase

తనిఖీ సమయంలో, DRI అధికారులు చట్టపరమైన మార్గదర్శకాలన్నింటినీ పాటించారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం, ఎవరైనా చట్టవిరుద్ధంగా ఏదైనా వస్తువును అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తే, నేరానికి సంబంధించిన నమ్మదగిన ప్రాథమిక ఆధారాలు ఉంటే బెయిల్ ఇవ్వకూడదు.

Ranya Rao Admits Using Hawala Money for Gold Purchase

సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైన తనిఖీ రాత్రి 1:30 గంటలకు ముగిసింది. ఆ తర్వాత రన్యాకు సమన్లు పంపి, ప్రాథమిక విచారణ జరిపి సమాచారం తీసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా, రన్యా బంగారం అక్రమంగా తరలించినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిన తర్వాతే అరెస్టు చేశామని తెలిపారు.

Ranya Rao Admits Using Hawala Money for Gold Purchase

అరెస్టుకు గల కారణాన్ని పేర్కొంటూ అరెస్టు రిపోర్టు అందజేశారు. కాబట్టి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. రన్యా తరపు న్యాయవాది వాదిస్తూ, రన్యా విచారణ, అరెస్టులో DRI అధికారులు కస్టమ్స్ చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. 

Ranya Rao Admits Using Hawala Money for Gold Purchase

కాబట్టి రన్యాకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణ ముగించి మార్చి 27న తీర్పు వెలువరిస్తామని వాయిదా వేసింది.

Latest Videos

vuukle one pixel image
click me!