మరో సౌత్ డైరక్టర్ ని లైన్ లో పెట్టిన సల్మాన్ ఖాన్?
సల్మాన్ ఖాన్ త్వరలో మరో తమిళ డైరక్టర్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. చర్చలు జరుగుతున్నాయి, స్టోరీ లైన్ ఓకే అయితే త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సల్మాన్ ఖాన్ త్వరలో మరో తమిళ డైరక్టర్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. చర్చలు జరుగుతున్నాయి, స్టోరీ లైన్ ఓకే అయితే త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
గత కొద్ది కాలంగా బాలీవుడ్ సినిమాల ట్రెండ్ మారిపోయింది. అక్కడ నార్త్ డైరక్టర్స్ తీసే సినిమాలు ఆడటం లేదు. ఇక్కడ సౌత్ లో మనవాళ్లు దుమ్ము దులుపుతున్నారు.
మన హీరోలు అక్కడ ప్యాన్ ఇండియా రిలీజ్ లంటూ అక్కడ మార్కెట్ ని గ్రాబ్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ అక్కడ స్టార్స్ గా వెలుగుతున్న అమీర్ ఖాన్, సల్మాన్ వంటివారికే దిక్కులేకుండాపోయింది.
దాంతో వాళ్లు ఇప్పుడు సౌత్ డైరక్టర్స్ తోనే తమ మార్కెట్ ని మళ్లీ వెనక్కి రప్పించుకోవాలని అనుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ కి చాన్నాళ్లుగా సరైన హిట్ లేదు. ఆ క్రమంలోనే తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో కలిసి సికిందర్ తీశాడు. సల్మాన్ కొత్త సినిమా ఈద్ (రంజాన్)కి రావడం ఆనవాయితీ.
అందుకు తగ్గట్లే ఈ సారి పండగకు సికిందర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బుకింగ్స్ ఓపెన్ చేశారు. సల్మాన్ తన నెక్ట్స్ ప్రాజెక్టు పై దృష్టి పెట్టారని సమాచారం. ఈ సారి కూడా సౌత్ డైరక్టర్ నే ఎంచుకుంటున్నారని బి టౌన్ లో వినిపిస్తోంది.
బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సల్మాన్ ఖాన్ తన నెక్ట్స్ ప్రాజెక్టుని అమరన్ ఫేమ్
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో చేయాలని ఫిక్స్ అయ్యారు.
శివకార్తికేయన్, సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందిన అమరన్ చిత్రం భాక్సాఫీస్ వద్ద మాసివ్ హిట్ అయ్యింది. దాంతో గత కొద్ది రోజులుగా సల్మాన్, రాజ్‌కుమార్ పెరియసామి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి.
సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ లో ఓ చిత్రం చేయటానికి ఓ స్టోరీ లైన్ ని వినిపిస్తే..పూర్తి స్క్రిప్టుతో రమ్మని సల్మాన్ అడిగినట్లు సమాచారం. అన్ని సెట్ అయితే త్వరలోనే ఈ ప్రాజెక్టు అఫీషియల్ ఎనౌన్సమెంట్ చేసే అవకాసం ఉంది.