ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్ కలిసి ఎందుకు సినిమాలు చేయడం లేదు? బాద్ షా సమాధానమిదే..
Aishwarya rai-Shahrukh Khan: ఐశ్వర్య రాయ్ తో సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారో, సినిమాలు ఎందుకు ఆపేశారో తెలుసుకోండి.
Aishwarya rai-Shahrukh Khan: ఐశ్వర్య రాయ్ తో సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారో, సినిమాలు ఎందుకు ఆపేశారో తెలుసుకోండి.
Aishwarya rai-Shahrukh Khan: ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కలిసి నటించిన సినిమాలు చూడటానికి అభిమానులు ఎగబడేవారు.అంతటి క్రేజ్ వీరి సినిమాలకు ఉంది. కానీ ఉన్నట్టుండి వీరిద్దరు కలిసి నటించడం మానేశారు. మరి దీనికి కారణం ఏంటి? అసలేం జరిగింది. షారూఖ్ బయటపెట్టాడు.
ఐశ్వర్య రాయ్, షారుఖ్ సినిమాలు ఎందుకో తగ్గిపోయాయి. ఇద్దరూ కలిసి కనిపించడం తగ్గింది. అసలు కారణం ఏమై ఉంటుందని ప్రశ్నిస్తే షారూఖ్ చెప్పిన సమాధానం ఆశ్చర్యపరుస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే.
`మా మొదటి సినిమా 'జోష్'లో ఐశ్వర్య చెల్లి పాత్ర చేసింది. రెండో సినిమా 'దేవదాస్'లో ఐశ్వర్య నన్ను వదిలి వెళ్లిపోతుంది.(హ్యాండిచ్చిపోతుంది)
మూడో సినిమా 'మొహబ్బతేం'లో దెయ్యం పాత్ర చేసింది. కానీ ఆమెతో నాకు ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేసే అవకాశం రాలేదు. ఈ విషయం నాకు చాలా బాధగా ఉంది` అని షారుఖ్ చెప్పారు. అలా తెలియకుండానే సినిమాలు చేయడం ఆగిపోయాయని, తమ కాంబినేషన్‌లో సినిమాలు చేయడానికి ఎవరూ రాలేదని తెలిపారు. అనుకోకుండానే ఆ గ్యాప్ ఏర్పడిందన్నారు.
వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చేయకపోయినా అప్పుడప్పుడు కార్యక్రమాల్లో, సినిమా ప్రీమియర్ షోలలో కలుస్తుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసే విధానం చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా ఫన్నీగా కలుసుకుంటున్నారట.
ఇన్నాళ్లూ సినిమా సెట్స్, సినిమా పనుల మీద కలిసేవాళ్లు, ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి దింపడానికి వచ్చినప్పుడు ఎదురెదురుగా కలుస్తున్నారట. తమ పిల్లల్ని డ్రాప్ చేసినప్పుడు ఎదురపడుతున్నట్టు తెలిపారు.