రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ధురంధర్. థియేటర్ లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ అభిమానులకు మాత్రం ఓ ట్విస్ట్ తప్పలేదు. ఇంతకీ ఏంటది.?
రణ్‌వీర్ సింగ్ నటించిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం తర్వాత ఓటీటీలో విడుదలైంది. నిర్మాతలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ రాత్రి 12 గంటల నుంచి సినిమా స్ట్రీమింగ్ మొదలవడంతో అభిమానులకు ఇది సర్‌ప్రైజ్‌గా మారింది. ఓటీటీలోకి వచ్చాక, ఈ సినిమాతో అభిమానులకు ఓ షాక్ తగిలినట్టు అయ్యింది. ఈసినిమా డ్యూరేషన్ విషయంలో ఓ చర్చ తెరపైకి వచ్చింది.
24
ధురంధర్ నిడివి తగ్గించారా..?
నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ కోసం ధురంధర్ నిడివి తగ్గించారా అనే కొత్త చర్చ ఫిల్మ్ సర్కిల్ లో మొదలైంది. థియేటర్లలో 'ధురంధర్' సినిమా నిడివి 3 గంటల 34 నిమిషాలు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా నిడివి 3 గంటల 25 నిమిషాలుగా చూపిస్తోంది. అంటే దాదాపు 9-10 నిమిషాలు తక్కువ. ఈ తేడా అభిమానులను గందరగోళానికి గురిచేసింది. నిర్మాతలు కొన్ని సీన్లు తీసేశారా లేక ఇది టెక్నికల్ సమస్యా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
34
సౌత్ ను టార్గెట్ చేసిన మేకర్స..
థియేటర్లలో 'ధురంధర్ హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని హిందీ, తమిళం, తెలుగు ఆడియోలలో కూడా చూడొచ్చు. ఇది సౌత్ ఇండియాలో ఆదరణ సాధిస్తుందని టీమ్ అంతా ఆశిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అయినా.. 'ధురంధర్ ఇంకా థియేటర్లలో నడుస్తూనే ఉంది.
2025 డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, ఇండియాలో రూ.900 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లు వసూలు చేసింది. ఓటీటీ రిలీజ్ బాక్సాఫీస్ వసూళ్లను ప్రభావితం చేస్తుందో లేదో చూడాలి. ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా సారా అర్జున్ నటించింది. ఆమె తెలుగులో 'నాన్న' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.