హీరోయిన్లు ధరించే బట్టలపై ఎంత పెద్ద వివాదం జరిగిందో చూశాం. దీనిపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇటీవల హీరోయిన్లు ధరించే బట్టలు, డ్రెస్సింగ్ స్టైల్ గురించి టాలీవుడ్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. శివాజీ చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలైంది. శివాజీ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. అనసూయ ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయి కౌంటర్ ఇవ్వడంతో రచ్చ ఇంకా పెద్దదైంది. శివాజీ, అనసూయ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మహిళలు ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అందులో ప్రాబ్లమ్ ఏంటి అని అనసూయ మాట్లాడింది. అనసూయ కామెంట్స్ ని కొందరు సపోర్ట్ చేయగా మరికొందరు ట్రోల్ చేశారు.
25
ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
తాజాగా మహిళల బట్టలపై మరో హీరోయిన్ స్పందించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఐశ్వర్య రాజేష్. ఈ మూవీ తర్వాత తెలుగులో ఐశ్వర్య రాజేష్ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ కి మహిళలు ధరించే బట్టల గురించి ప్రశ్న ఎదురైంది.
35
వద్దు అని చెబితే ఆ బట్టలు వేసుకోను
మీకు కాబోయే భర్త కానీ, మీకు కావలసిన వాళ్ళు కానీ ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, ఈ బట్టలు వేసుకో అని చెబితే వింటారా అని యాంకర్ ప్రశ్నించారు. దీనితో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. తప్పకుండా వింటాను. మన మంచి కోసం చెబుతున్నప్పుడు వింటే తప్పు ఏంటి అని అన్నారు. వాళ్ళు వద్దు అని చెబితే నేను ఆ డ్రెస్ వేసుకోను. నా వ్యక్తిత్వం అంతే.
మా ఇంట్లో మా బ్రదర్.. అమ్ములు ఈ డ్రెస్ బాగాలేదు అని చెబితే వెంటనే దానిని పక్కన పెట్టేస్తాను. నేను ఎప్పుడైనా ఫారెన్ వెళితే అక్కడ వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటా. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు డ్రెస్సింగ్ పై నా ఒపీనియన్ చెప్పాలి అంటే.. రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని అంటాను. ఎక్కడికైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే అక్కడ జనాలు ఎలా ఉంటారో తెలుసు. కాబట్టి రివీలింగ్ డ్రెస్సులు వేసుకోవడం మంచిది కాదు.
55
ఎవరి ఇష్టం వాళ్ళది
కానీ ఎవరైనా రివీలింగ్ డ్రెస్సులు వేసుకోవాలి అంటే మనం అడ్డు చెప్పలేం. అది వాళ్ళ ఇష్టం. నా వరకు మాత్రం డ్రెస్సింగ్ అనేది రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని భావిస్తా అని ఐశ్వర్య రాజేష్ అన్నారు.