Ranabaali Target: రణబాలి మూవీ హిట్‌ టార్గెట్‌, విజయ్‌ దేవరకొండ, రష్మిక ఎంత తీసుకున్నారంటే?

Published : Oct 14, 2026, 06:27 PM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన `రణబాలి` మూవీకి సుమారు రూ.120కోట్ల బడ్జెట్‌ అయ్యింది. మరి థియేట్రికల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంత? ఎంత వస్తే నిర్మాతలు సేఫ్‌ అనేది చూస్తే.

PREV
14
పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా రణబాలి

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమా `రణబాలి`. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. `టాక్సీవాలా` తర్వాత విజయ్‌, రాహుల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ నిర్మించారు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా ఇది తెరకెక్కుతుంది.

24
రణబాలి మూవీ బడ్జెట్‌, కాస్టింగ్‌ పారితోషికం

ఈ సినిమాకి భారీ బడ్జెట్ అయ్యిందట. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌ కావడం విశేషం. ఈ మూవీకి రూ.120కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. ఈ మూవీకి విజయ్‌ దేవరకొండ భారీగానే పారితోషికం తీసుకుంటున్నాడట. ఆయనకు ఏకంగా రూ.25కోట్లు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. రష్మిక మందన్నా కి ఎనిమిది కోట్లు ఇచ్చినట్టు టాక్‌. వీరితోపాటు మెయిన్‌ విలన్‌గా నటించిన హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్ వోస్లూకి ఐదు కోట్ల వరకు ఇచ్చారట. లాల్‌కి బాగానే ముట్టిందని సమాచారం. ఇలా పారితోషికాల రూపంలోనే యాభై కోట్ల వరకు అయ్యిందని తెలుస్తోంది.

34
రణబాలి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

సినిమాకి ఆర్ట్ వర్క్ ఎక్కువగా ఉంది. సెట్లు, పీరియడ్‌ టైమ్‌ని రీక్రియేట్‌ చేయడం వంటి వాటికి ఎక్కువగా ఖర్చు అయినట్టు సమాచారం. అయితే ఈ మూవీకి నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ కూడా బాగానే జరిగింది. ఏకంగా అరవై కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓటీటీ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ దక్కించుకుంది. శాటిలైట్‌ రైట్స్, ఆడియో అన్నీ కలిపి సగం బడ్జెట్‌ వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్‌గా ఇంకా సగం చేయాలి. అంటే అరవై కోట్లు రాబట్టాలి. కలెక్షన్ల పరంగా చూస్తే రూ.120కోట్ల వరకు గ్రాస్‌ చేయాలి. మరి ఇది ఎంత వరకు రాబడుతుందనేది చూడాలి.

44
విజయ్‌, రష్మిక ముందు భారీ టార్గెట్‌

సినిమా బాగుంటే పెద్ద సమస్య కాదు, వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో ఈజీగానే రాబట్టవచ్చు. కానీ ఆడియెన్స్ కి మూవీ ఎంత వరకు ఎక్కుతుందనేది ఇప్పుడు ప్రశ్న. అదే అందరిని కలవరపెడుతుంది. మరి విజయ్‌ దేవరకొండ, రష్మికలు ఏం మ్యాజిక్‌ చేస్తారో చూడాలి. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కాబోతుంది. మొదట పాన్‌ ఇండియా రిలీజ్‌ అనుకుంటున్నారు. కానీ తెలుగులోనే ఇప్పుడు రిలీజ్‌ కాబోతుందట.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories