కృష్ణ, శోభన్ బాబు నుంచి సూర్యకాంతం వరకు, లెజెండ్స్ అంతా ఉన్నారు.. దర్శకుడే ఫ్లాప్ అన్నారు, కట్ చేస్తే

Published : Oct 14, 2026, 05:37 PM IST

కృష్ణ. శోభన్ బాబు, సూర్యకాంతం, శ్రీదేవి లాంటి లెజెండ్స్ నటించిన సినిమా గురించి పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము రాసిన కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది అని దర్శకుడే అన్నట్లు ఆయన తెలిపారు.

PREV
15
కృష్ణ అండ్ శోభన్ బాబు

పరుచూరి బ్రదర్స్ గా పిలవబడే పరుచూరి గోపాల కృష్ణ, పరుచూరి వెంకటేశ్వర రావు సోదరులు టాలీవుడ్ లో వందల సినిమాలకు రచన అందించారు. కథలు, మాటలు రాశారు. నందమూరి తారకరామారావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలకు పరుచూరి బ్రదర్స్ పనిచేశారు. కెరీర్ ఆరంభంలో తాము చేసిన గొప్ప సినిమాల్లో ముందడుగు ఒకటి అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

25
ముందడుగు మూవీ

మల్టీస్టారర్ సినిమాకు కథ రాయడం, ప్రేక్షకులని మెప్పించడం అంత సులువు కాదు. కానీ పరుచూరి బ్రదర్స్ శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన ముందడుగు చిత్రానికి కథ, సంభాషణలు అందించారు. పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ మాపై నమ్మకంతో డి రామానాయుడు గారు కృష్ణ, శోభన్ బాబు మల్టీస్టారర్ చిత్రానికి కథ రాయమని అడ్వాన్స్ ఇచ్చారు.

35
ఈ కథతో సినిమా చేస్తే ఫ్లాప్

కొంత సమయం తీసుకుని కథ పూర్తి చేసి దర్శకుడు కె బాపయ్యకి వినిపించాం. విన్న వెంటనే కథ అస్సలు బాగాలేదు. ఈ కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది అని ముఖం మీదే చెప్పారు. అప్పుడు మేము సార్.. రామానాయుడు గారి సొమ్ము మేము తిన్నాం. ఆయన సొమ్ముకు మేము పని చేశాం అని తెలియాలి. కాబట్టి ఆయనకు కథ బాగాలేదు అని చెప్పొద్దు. ఒకసారి వినమని చెప్పండి అని అడిగాం. చిరాగ్గా సరేలే అని అన్నారు.

45
ఫ్యామిలీ మొత్తం కథ విన్నారు

రామానాయుడు గారి ఇంటికి కథ చెప్పడానికి వెళ్ళాం. అక్కడ రామానాయుడుతో పాటు సురేష్ బాబు, వెంకటేష్, ఇతర ఫ్యామిలీ మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూర్చుని ఉండగా 2 గంటలు కథ చెప్పాం. రామానాయుడుగారి కథ అద్భుతంగా నచ్చేసింది. ఎలాంటి మార్పులు అవసరం లేకుండా సినిమా చేద్దాం అని అన్నారు. వెంటనే బాపయ్యకి ఫోన్ చేసి ఈ కథతో మనం సినిమా చేస్తున్నాం అని చెప్పారు. ఆ విధంగా ముందడుగు మూవీ ప్రారంభం అయింది. ఈ మూవీలో కృష్ణ కి జోడీగా జయప్రద, శోభన్ బాబుకి జోడీగా శ్రీదేవి నటించారు.

55
ఆ లెజెండ్స్ ఇప్పుడు లేరు

అదే విధంగా గుమ్మడి, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, సూర్యకాంతం, ప్రభాకర్ రెడ్డి, నూతన ప్రసాద్ ఇలా ఎందరో లెజెండ్స్ ఈ మూవీలో నటించాయారు. రీసెంట్ గా ఆ సినిమా చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అందులో నటించిన నటులు ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు లేరు. దర్శకుడే అనుమానపడ్డ ఆ చిత్రం సంచలన విజయం సాధించింది అని పరుచూరి తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories