Ranabaali 4 Days Collections: సోమవారం రణబాలికి ఊహించని కలెక్షన్లు, 4 రోజుల్లో ఎంత వచ్చాయి, ఇంకా ఎంత రావాలి?

Published : Oct 20, 2026, 07:11 AM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన `రణబాలి` మూవీ నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. సోమవారం ఈ సినిమాకి ఊహించిన కలెక్షన్లు వచ్చాయి. అదే ఆశ్చర్యపరుస్తోంది.

PREV
13
బాక్సాఫీసు వద్ద స్టడీగా రణబాలి

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన `రణబాలి` మూవీ బాక్సాఫీసు వద్ద తన సత్తాని చాటుతోంది. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. కానీ ఆ తర్వాత వసూళ్లు స్టడీగా ఉన్నాయి. వరుస సెలవులు కావడంతో డీసెంట్‌ కలెక్షన్లతో రన్‌ అవుతుంది. బాక్సాఫీసు వద్ద విజయ్‌ దేవరకొండ తన సత్తాని చాటుతున్నాడు. ఇక రణబాలి మూవీ విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత వచ్చాయి? సినిమా హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలనేది చూస్తే.

23
రణబాలి మూవీ 4 రోజుల కలెక్షన్లు

`రణబాలి` మూవీకి సోమవారం దాదాపు ఏడు కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఇండియాలో దీనికి రూ.5.40కోట్ల నెట్‌ రాగా, ఆరున్నర కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో యాభై లక్షలు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఆదివారంతో పోల్చితే దాదాపు 70శాతం రికవరీ సాధించడం విశేషం. సాధారణంగా సోమవారం కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి. యాభై శాతం కంటే తక్కువగానే నమోదు అవుతాయి. కానీ దీనికి 60-70శాతం వసూళ్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది. సినిమా స్ట్రాంగ్‌గా ఉందనడానికిది నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం నాలుగు రోజుల్లో మొత్తంగా రూ.43.85కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది. ఓవర్సీస్‌లో దీనికి తొమ్మిదిన్నర కోట్లు వచ్చాయి. అయితే బాలీవుడ్‌ మూవీ రివ్యూస్‌ సైట్ మాత్రం ఈ చిత్రం నాలుగు రోజుల్లో దాదాపు యాభై కోట్లు సాధించినట్టు వెల్లడించడం విశేషం.

33
రణబాలి హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన `రణబాలి` మూవీకి రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. 1880 నాటి పరిస్థితులు, కరవు, బ్రిటీష్‌ ఆగడాలు, వాళ్లు సృష్టించిన కరవు కారణంగా లక్షల మంది జనం చనిపోయారు. ఈ కథాంశంతో ఈ సినిమాని రూపొందించారు రాహుల్‌. దీనికి సుమారు రూ.120కోట్ల బడ్జెట్‌ అయినట్టు సమాచారం. థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.42కోట్లుగా లెక్క కట్టారు. అంటే సుమారు రూ.85కోట్ల గ్రాస్‌ రావాలి. ఇప్పుడు దాదాపు 50-60శాతం వసూళ్లని రాబట్టింది. ఇదే జోరు ఈ వారం, వచ్చే వారం కూడా చూపిస్తే మూవీ సేఫ్‌ అవుతుంది. మరి ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి. అయితే ఇందులో విజయ్‌ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. నాగ్‌ అశ్విన్‌ కూడా ప్రశంసలు కురిపించారు. రష్మిక మందన్నా నటనకు ఫిదా అయినట్టు తెలిపారు. వీరితోపాటు చాలా మంది విజయ్‌ నటన గురించి మాట్లాడుతుండటం విశేషం. రణబాలిలో ఆయన విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories