బిగ్ బాస్ తెలుగు 10లో 43వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఎప్పటిలాగే రోహిత్, త్రిగుణ్ పక్క వాళ్ళ నామినేషన్స్ లోకి దూరి ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. బెదిరింపులకు దిగారు.
బిగ్ బాస్ హౌస్ లో 43వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్వయంగా నామినేషన్స్ చేసే వారి పేరు చెప్పి ఆహ్వానించారు. ముందుగా బిగ్ బాస్ ఝాన్సీని పిలిచి ఒకరిని నామినేట్ చేయమని అడిగారు. దీనితో ఝాన్సీ.. వైల్డ్ ఫైర్ ఆర్కేని నామినేట్ చేసింది.
25
ఆర్కేని నామినేట్ చేసిన ఝాన్సీ
ఆమె చెప్పిన రీజన్.. టాస్క్ లో భాగంగా షాలినిని నెట్టినప్పుడు దానికి తెగ ఫీల్ అయిపోయి క్షమాపణ కోరడం, ఆమె కాళ్లపై పడి క్షమాపణ అడగడం ఎందుకు అని ప్రశ్నించింది. ఆర్కే సరిగ్గా అందరితో కలవలేకున్నాడు.. తనని తాను డిఫెండ్ చేసుకోలేకున్నాడు అనే విమర్శ ఉంది. దానిని చెరిపివేయాలనుకున్నాడో ఏమో కానీ అతడు ఝాన్సీకి ఇచ్చిన కౌంటర్ మాత్రం అంత సహజంగా లేదు. తాను కూడా గట్టిగా మాట్లాడుతున్నాను అని నిరూపించుకునేందుకు కొన్ని ప్రయత్నాలు చేశాడు. షాలినిని నెట్టినప్పుడు ఆమె ఫీల్ అయింది. నేను తప్పు చేశాను అని అనిపించింది. అందుకే కాళ్లపై పడ్డా అందులో తప్పు ఏముంది.. అసలు ఇది నామినేషన్ పోయింటా అంటూ ఝాన్సీపై గట్టిగా అరిచాడు.
35
వర్షిణి గేమ్ కనిపించడం లేదు
ఆ తర్వాత రోహిత్ సుధీర్ ని నామినేట్ చేశారు. బాల్ టాస్క్ లో జరిగిన ఒప్పందాల గురించి, వెన్నుపోటు గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత నీతూ మాస్టర్.. వర్షిణి నామినేట్ చేశారు. వర్షిణి గేమ్ అసలు కనిపించడం లేదు.. ఆమె ముకేశ్ చాటున ఉంది ఆడుతోంది అని విమర్శించింది. అసలు మీరెక్కడ కనిపిస్తున్నారు అంటూ వర్షిణి కౌంటర్ ఇచ్చింది.
ఆ తర్వాత శివకుమార్.. రోహిత్ ని నామినేట్ చేశాడు. హౌస్ లోఇండివిడ్యువల్ గేమ్ ఆడడం లేదు అని రోహిత్ అందరిని విమర్శిస్తుంటారు. నిజాలు మాట్లాడుకుంటే హౌస్ లో ఒక్క ఇండివిడ్యువల్ గేమ్ కూడా ఆడని వ్యక్తి రోహిత్. అతను తనకంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని వాళ్లంతోనే గేమ్ ఆడుతున్నాడు. మిగిలిన వాళ్ళతో అస్సలు కలవడం లేదు అని శివకుమార్ విమర్శించారు. ఎవరైన కొంచెం ట్రిగ్గర్ చేస్తే వెంటనే రోహిత్ నోటి వెంట అసభ్యకరమైన మాటలు వచ్చేస్తాయి అని శివ కుమార్ తెలిపారు.
వెంటనే బాల్ టాస్క్ గురించి చర్చ మొదలైంది. చెల్లి చెల్లి అంటూ షాలిని చుట్టూ తిరిగి ఆమెకే వెన్నుపోటు పొడిచాడు అంటూ రోహిత్ త్రిగుణ్ పై ఫైర్ అయ్యాడు. చెల్లెలుగా ఆమె గౌరవం కోల్పోయింది అని త్రిగుణ్ అన్నారు. నక్కల్ని కొట్టాలి అంటే నక్కలాగే మారాలి. అసలు షాలినికి ఫేవర్ చేయాలని రోహిత్ ముందే ఫిక్స్ అయ్యాడు. అందుకే నేను అమన్ కి సపోర్ట్ చేశా అని త్రిగుణ్ తెలిపారు. మాటా మాటా పెరిగి త్రిగుణ్, రోహిత్ హద్దులు దాటారు. త్రిగుణ్ ఇకచాలు పోరా రోహిత్ అని అన్నాడు. ఏంటి రా అంటావా చెంప పగులుద్ది అని రోహిత్ కౌంటర్ ఇచ్చారు. ఏది పగలగొట్టు చూద్దాం అని త్రిగుణ్ అంటే… గేటు బయటకు వస్తావుగా అప్పుడు దొరకవా అంటూ రోహిత్ త్రిగుణ్ కి వార్నింగ్ ఇచ్చారు.