శోభన్‌బాబు చాలా సిస్టామాటిక్ లైఫ్‌ని లీడ్ చేశారు. అయితే ఆయన రిటైర్‌మెంట్ వెనుక పెద్ద కారణం ఉంది. ఒక లేడీ అన్న మాటతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట.
సోగ్గాడు శోభన్ బాబు.. తెలుగు ఆడియెన్స్ మరిదిలో ఒక సూపర్ స్టార్‌గా నిలిచిపోయారు. ఆయన మహిళా ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టారు. అప్పట్లో మహిళా అభిమానులు ఎక్కువగా ఉన్న హీరోగా శోభన్‌బాబు నిలిచారు. ఆయన ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలు చేయడం, ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు, భార్యాభర్తల మధ్య అనుబంధాలకు సంబంధించిన కథలతో ఎక్కువగా సినిమాలు చేయడంతో లేడీ అభిమానులు ఎక్కువగా ఆయన్ని ఇష్టపడ్డారు. అందంలోనూ ఎవర్ గ్రీన్ అనిపించుకున్నారు.
24
సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేసిన సోగ్గాడు
అయితే శోభన్‌బాబు ఏం చేసినా సిస్టమాటిక్‌గా ఉంటుంది. ఆయన షూటింగ్ ల విషయంలోనూ టైమింగ్స్ ని ఫాలో అయ్యేవారు. సాయంత్రం ఆరు దాటితే షూటింగ్ చేసేవారు కాదు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఉంటే ముందే చెప్పాలి. మాక్సిమమ్ ఆరు తర్వాత షూటింగ్‌లు బంద్. ఆ తర్వాత తన వ్యక్తిగతంగా టైమ్ కేటాయించుకునేవారు. ఫ్యామిలీకి టైమ్ ఇచ్చేవారు. అదే సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పే విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారట. 1980 దాటి 90 వస్తున్న సమయంలోనే ఆయన సినిమాలు మానేయాలనుకున్నారట. యాభై ఏళ్లు దాటిన నేపథ్యంలో ఇక సినిమాలు మానేయాలనుకున్నారట. కానీ కొందరు శ్రేయోభిలాషులు సలహా మేరకు షూటింగ్‌లు చేశారు.
34
శోభన్‌బాబు సినిమాలు మానేయడం వెనుక లేడీ
అయితే ఆయన సినిమాలు మానేయడానికి, పబ్లిక్ కి దూరంగా ఉండటానికి ఒక కారణం ఉందట. జనాల్లో తాను ఎప్పటికీ సోగ్గాడిగానే నిలిచిపోవాలని, అందగాడిగానే ఉండాలని తాను కోరుకున్నారు. అందుకు ముందుగానే రిటైర్‌మెంట్ ఇవ్వాలనుకున్నారు. అయితే అరవై ఏళ్లు దాటాక ఆయన ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లాడట. ఫంక్షన్ అయిపోయాక కారు వద్దకు వెళ్తుంటే ఒక లేడీ వచ్చి పలకరించిందట. ముసలితనం కనిపిస్తుందిగా అని అన్నదట. అంతే ఆ దెబ్బతో ఇక పబ్లిక్‌లోకి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నారట.
ఆ తర్వాత నుంచి సినిమాలు మానేశారు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. తన గార్డెన్, ఇళ్లు, పుస్తకాలు చదివే రూమ్ అంతటికే పరిమితమయ్యారట. ఆ తర్వాత అభిమానులు వస్తే వారితో మాట్లాడేవారట. అంతకు ముందు అభిమానులను పట్టించుకోలేదని, రిటైర్‌మెంట్ తర్వాత మాత్రం వారిని ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని, వారికి టైమ్ కేటాయించేవారని సీనియర్ జర్నలిస్ట్, రైటర్ శ్రీకాంత్ వెల్లడించారు. 1959లో `దైవబలం` అనే సినిమాతో నటుడిగా కెరీర్‌ని ప్రారంభించిన శోభన్‌బాబు.. 1996లో హలో గురు చిత్రంతో సినిమాకు గుడ్ బై చెప్పారు. అరవై ఏళ్లకే ఆయన రిటైర్‌మెంట్ తీసుకొని ఫ్యామిలీకే పరిమితమయ్యారు. 2008లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. సోగ్గాడు మన మధ్యలో లేకపోయినా తన సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు.